Bjp
BJP Won in Lakhimpur: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ అఖండ విజయాన్ని నమోదు చేసింది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ లో యోగి ఆదిత్యనాథ్ వరుసగా రెండోసారి బీజేపీని గెలిపించి 30 ఏళ్ల చరిత్రను తిరగరాశారు. “మతతత్వ పార్టీ” అన్న ముద్రను చెరిపేస్తూ.. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికై ప్రజల అభిమానాన్ని చూరగొన్న పార్టీగా ఉత్తరప్రదేశ్ లో బీజేపీ అవతరించింది. ఈ క్రెడిట్ అంతా సీఎం యోగి ఆదిత్యనాథ్ కు దక్కుతుందని విశ్లేషకులు అంటున్న మాట. దేశ వ్యాప్తంగా సంచనలం కలిగించిన “లఖింపూర్ ఖేరీ” ఘటనతో బీజేపీపై యూపీలో వ్యతిరేకత పెరిగిందంటూ ప్రతిపక్షాలు చేసిన అసత్య ప్రచారాలను సైతం తిప్పికొడుతూ లఖింపూర్ ఖేరీ జిల్లాలోని మొత్తం 8 నియోజకవర్గాల్లో బీజేపీ విజయకేతనం ఎగురవేసిందంటే..బీజేపీ నేతలు పార్టీని ప్రజల్లో ఎంత లీనం చేశారు అర్ధం అవుతుంది.
Also Read: Punjab : పంజాబ్‌కా షాన్.. పంజాబ్‌కా షేర్.. హాస్యనటుడు నుంచి ముఖ్యమంత్రి వరకు ప్రస్థానం
ఉత్తరప్రదేశ్ లోని లఖింపూర్ ఖేరీ జిల్లాలో 2021 అక్టోబర్ 3న నిరసన తెలుపుతున్న రైతులను కేంద్ర మంత్రి అజయ్ మిశ్ర కుమారుడు ఆశిష్ మిశ్ర తన వాహనంతో తొక్కించాడు. ఈఘటనలో నలుగురు రైతులు సహా మొత్తం 8 మంది మృతి చెందగా మరో డజను మంది గాయపడ్డారు. ఈ వ్యవహారం దేశ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించగా..ఆశిష్ మిశ్రా సహా మరో 20 మందిపై కేసులు నమోదు అయ్యాయి. కాగా సరిగ్గా యూపీలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే సమయానికి ఈ ఘటన చోటుచేసుకోవడంతో.. అటు సీఎం యోగితో పాటు ఇటు కేంద్రంలోని బీజేపీ అధిష్టానంపైనా తీవ్ర ఒత్తిడి ఏర్పడింది. దీనిపై ఆచూతూచి వ్యవహరించిన బీజేపీ అధిష్టానం.. కేంద్ర మంత్రి కుమారుడైనా శిక్ష పడాల్సిందే అంటూ కఠినంగా వ్యవహరించి ప్రజల్లో వ్యతిరేకత రాకుండా జాగ్రత్త పడింది.
Also read: Five State Elections : త్వరలో రాష్ట్ర పార్టీలో కొత్త కమిటీ – కోమటి రెడ్డి
అయితే లఖింపూర్ ఖేరీ ఘటనలో కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా హస్తం ఉందంటూ ఆరోపించిన ప్రతిపక్షాలు.. ఆమేరకు ఆయన్ను మంత్రి పదవి నుంచి తొలగించాలంటూ బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అజయ్ మిశ్రాను తొలగించకపోవడంతో బీజేపీపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇక్కడ కూడా బీజేపీ అధిష్టానం జాగ్రత్తతో వ్యవహరించింది. ఇన్ని విమర్శలు వచ్చినా ఆయన్ను ఆ పదవి నుంచి తొలగించకపోవడంతో.. హోం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా చివరకు పార్టీకి అనుకూలంగా మారారు. లఖింపూర్ ఖేరీ జిల్లాలో బ్రాహ్మణుల ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని అజయ్ మిశ్రా రాజీనామాను ఆమోదించడానికి బీజేపీ అధిష్టానం నిరాకరించింది.
Also read: Telangana Politics : తెలంగాణపై ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల ఎఫెక్ట్?
అంతే కాదు లఖింపూర్ ఖేరీ ఘటనలో ఆశిష్ మిశ్రా పై చట్టపరమైన చర్యలు కొనసాగుతాయని, అందుకు తన తండ్రి, కేంద్ర మంత్రి అయిన అజయ్ మిశ్రాను తప్పు పట్టలేమంటూ చెప్పుకొచ్చిన బీజేపీ అధిష్టానం.. కేంద్ర మంత్రిగా అజయ్ మిశ్రాను మరింత సమర్ధించింది. ఆ బహిరంగ మద్దతు ఫలితమే లఖింపూర్ ఖేరీలో కమలం వికసించేలా చేసింది. ఇక్కడ బ్రాహ్మణ ఓటు బ్యాంకుతో సంపూర్ణ మద్దతు కూడగట్టుకున్న బీజేపీ నేతలు మొత్తం 8 అసెంబ్లీ స్థానాల్లో విజయకేతనం ఎగురవేశారు.
Also read: Arvind Kejriwal : దేశం మొత్తం ఇంక్విలాబ్ రావాలి.. పంజాబ్‌కు స్వాతంత్రం వచ్చింది..