Five State Elections : త్వరలో రాష్ట్ర పార్టీలో కొత్త కమిటీ – కోమటి రెడ్డి

ఫలితాల ప్రభావం తెలంగాణపై ఉండదనే ధీమా వ్యక్తం చేశారు. గతంలో మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో గెలిచి విషయాన్ని ఆయన ప్రస్తావించారు...

Five State Elections : త్వరలో రాష్ట్ర పార్టీలో కొత్త కమిటీ – కోమటి రెడ్డి

Komatireddy Venkat Reddy Sensational Comments

Congress MP Komatireddy : తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కొత్త కమిటీ రాబోతోంది. ఈ విషయాన్ని పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలో పార్టీని గాడిలో పెట్టేందుకు బలమైన నాయకులతో కమిటీ ఏర్పాటు చేస్తారని వెల్లడించారు. ఐదు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాభవంపై ఆయన స్పందించారు. ఎన్నికల ఫలితాలపై సమీక్షించుకుని ముందుకెళుతామన్నారు.

Read More : Punjab Election Review: పంజాబ్ లో కాంగ్రెస్ పార్టీని నిండా ముంచిన “త్రిమూర్తులు”

ఈ ఫలితాల ప్రభావం తెలంగాణపై ఉండదనే ధీమా వ్యక్తం చేశారు. గతంలో మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో గెలిచి విషయాన్ని ఆయన ప్రస్తావించారు. యూపీలో 80 – 20 అనే మతతత్వ వాదన తెచ్చారని, అందుకే కాంగ్రెస్ అక్కడ గెలవలేకపోయిందనే కారణం చెప్పారు. ఐదు రాష్ట్రాలలలో అభివృద్ధి మీద ఎన్నికలు జరగలేదు.. మత రాజకీయాలపై జరిగాయని ఆరోపించారు. ఫలితాలపై సోనియా గాంధీతో చర్చించి .. భవిష్యత్తు కార్యచరణ చేపడతామని వెల్లడించారు.

Read More : Assembly Election Results 2022 : ఎన్నికల విజయోత్సవ ర్యాలీలకు సీఈసీ గ్రీన్ సిగ్నల్..

ఈ ఫలితాలతో క్యాడర్ ఎలాంటి డీలా పడకుండా ముందుకెళ్లేలా చర్యలు తీసుకుంటామని, గతంలో 24 సీట్లకు పరిమితమైన తర్వాత పదేళ్లు అధికారంలో ఉన్నామన్నారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ గురించి మంత్రి కేటీఆర్ ఎగతాళిగా మాట్లాడారని తెలిపారు. టీవీల ముందు కూర్చొండి అని సీఎం కేసీఆర్ అంటే.. బిశ్వాల్ కమిటీ ప్రకారం అన్ని భర్తీ చేస్తారనుకున్నామన్నారు. 40 లక్షల మంది నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తారనుకున్నామని, తమ ప్రభుత్వం వచ్చాక ఖాళీలన్నీ భర్తీ చేస్తామని ఎంపీ కోమటిరెడ్డి తెలిపారు.