LPG Cylinder Price : భారీగా తగ్గిన ఎల్ పీజీ వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర.. ఆగస్టు 1 నుంచి అమల్లోకి

కాగా, గృహ అవసరాల ఎల్ పీజీ గ్యాస్ సిలిండర్ ధరలలో ఎలాంటి మార్పు లేదు. చమురు మార్కెటింగ్ కంపెనీలు ఆగస్టు1 ఉదయం కమర్షియల్ సిలిండర్ల ధరను రూ.100 తగ్గించాయి.

LPG commercial gas cylinder

Gas Cylinder Price Reduced : ఎల్ పీజీ వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర భారీగా తగ్గింది. 19 కేజీల కమర్షియల్ ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధర రూ.99.75 తగ్గింది. నేటి నుంచి(ఆగస్టు1) తగ్గిన ధరలు అమలులోకి వచ్చాయి. ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ ఎల్ పీజీ సిలిండర్ ధర రూ. 1,680 గా ఉంది. కాగా, గృహ అవసరాల ఎల్ పీజీ గ్యాస్ సిలిండర్ ధరలలో ఎలాంటి మార్పు లేదు. చమురు మార్కెటింగ్ కంపెనీలు ఆగస్టు1 ఉదయం కమర్షియల్ సిలిండర్ల ధరను రూ.100 తగ్గించాయి.

19 కిలోల కమర్షియల్ ఎల్ పీజీ గ్యాస్ సిలిండర్ ధర రూ.1,680 చెల్లించాల్సి ఉంటుంది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొత్త ధర ఆగస్టు1 నుంచి అమలుల్లోకి వచ్చింది. ఢిల్లీలో మునుపటిలా రూ.1103 చెల్లించాల్సి ఉంటుంది. ఢిల్లీలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.1780 నుంచి రూ.1680కి తగ్గింది. కోల్ కతాలో గతంలో రూ.1895.50 ఉండగా, ప్రస్తుతం రూ.1802.50 చెల్లించాల్సి ఉంటుంది.

Delhi Ordinance Bill : నేడు పార్లమెంట్ ముందుకు ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లు.. వ్యతిరేకిస్తున్న విపక్ష కూటమి ఇండియా

ముంబైలో గతంలో రూ.1733.50 చెల్లించాల్సివుండగా ఇప్పుడు రూ.1640.50కి లభించనుంది.
చెన్నైలో కమర్షియల్ గ్యాస్ సిలిండర ధర రూ.1945 నుంచి రూ.1852.50కి తగ్గింది. మార్చి1,2023న కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.2119.50గా ఉంది. ఆ తర్వాత ఏప్రిల్ లో రూ.2020కి తగ్గింది. మే నెలలో రూ.1856.50కి తగ్గగా, జూన్ 1న రూ.1773కు తగ్గింది.

అయితే దీని తర్వాత జులై నెలలో రూ.7 పెరగడంతో ఢిల్లీలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.1780కి చేరింది. భారత్, ఇండేన్, హెచ్ పీ వంటి కంపెనీలు ఇప్పుడు 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను మాత్రమే తగ్గించగా 14.2 కిలోల గృవ అవసరాల గ్యాస్ సిలిండర్ ధర మాత్రం స్థిరంగానే ఉంది. ఈ గ్యాస్ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు.