భర్త పేరు మీద పాస్‌పోర్ట్ చేయించి ప్రియుడితో ఫారిన్ టూర్.. లాక్‌డౌన్ పట్టించేసింది..

భర్త పేరు మీద పాస్‌పోర్టు చేయించి.. ఆస్ట్రేలియా టూర్ కు చెక్కేసింది 36ఏళ్ల మహిళ. టూర్ మధ్యలో లాక్‌డౌన్ అమలుకావడంతో అక్కడే ఇరుక్కుపోయారు. ఇంతలో భర్త పాస్‌పోర్ట్ కావాలంటూ అధికారులను కలవడంతో విషయం బయటపడింది. నిజానికి వాళ్లు మార్చిలోనే తిరిగి వచ్చేయాలని టిక్కెట్స్ కూడా తీసేసుకున్నారు. కానీ, నేషనల్ వైడ్ లాక్‌డౌన్ తో అంతర్జాతీయ విమానాలన్నింటినీ ఆపేసింది గవర్నమెంట్.

దాంతో తప్పక ఆగష్టు 24కు కానీ, ఇళ్లకు చేరుకోలేకపోయారు. దంగారీ గ్రామానికి చెందిన మహిళ భర్త.. ముంబైలో పనిచేస్తున్నారు. సందీప్ సింగ్ అనే వ్యక్తి తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని కంప్లైంట్ చేశాడు. వారి పిల్లల్లో ఒకరు ఆస్ట్రేలియాలో చదువుతుండగా పాస్ పోర్ట్ కోసం అప్లై చేయాలని వెళ్లాడు.

అప్పుడే అతని పేరిట ఆల్రెడీ జనవరిలోనే పాస్ పోర్ట్ అప్లై చేశారని తెలిసింది. అతను చేసిన కంప్లైంట్ మేరకు ఎఫ్ఐఆర్ రిజిష్టర్ చేశామని ఎస్పీ జై ప్రకాశ్ యాదవ్ తెలిపారు. లోకల్ ఇంటలిజెన్స్ యూనిట్ సహాయంతో విచారణ జరుపుతున్నామని తెలిపారు.

బాధితుడు 20సంవత్సరాలుగా ముంబైలో పనిచేస్తున్నారు. వారసత్వంగా వచ్చిన యూపీలో ఉన్న ఫామ్ హౌజ్ లో ఫ్యామిలీ ఉంటుంది. ‘మే 18న పిలిభిట్ తిరిగి వచ్చేసరికి నా భార్య ఇంట్లో లేదు. సందీప్ ఫ్యామిలీని ఎంక్వైరీ చేస్తే ఆస్ట్రేలియా వెళ్లాడని తెలిసింది. ఈ క్రమంలోనే నా పేరు మీదే పాస్ పోర్ట్ చేయించుకుని ఆస్ట్రేలియా వెళ్లినట్లు తెలిసింది. అది ఆల్రెడీ 2019 ఫిబ్రవరి 2నే వచ్చినట్లు తెలిసింది.