హైదరాబాద్‌లో CPI నిరసన : అమీత్ షా దిష్టిబొమ్మ దగ్దాన్ని అడ్డుకున్న పోలీసులు 

  • Publish Date - February 27, 2020 / 08:21 AM IST

ఢిల్లీలో జరిగిన అల్లర్లను ఖండిస్తూ…హైదరాబాద్‌లో సీపీఐ చేపట్టిన నిరసన ప్రదర్శన తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. హిమాయత్ నగర్‌లో 2020, ఫిబ్రవరి 27వ తేదీ గురువారం సీపీఐ కార్యకర్తలు, నాయకులు కేంద్ర హోం మంత్రి అమీత్ షా దిష్టిబొమ్మతో నిరసన ప్రదర్శన నిర్వహించారు. చౌరాస్తా వద్ద దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు ప్రయత్నించారు. అక్కడనే భారీగా ఉన్న పోలీసులు వీరిని అడ్డుకొనేందుకు ప్రయత్నించారు.

దీంతో సీపీఐ నేతలు, పోలీసుల మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. పలువురు కార్యకర్తలు కిందపడిపోయారు. ఎలాగైనా దిష్టిబొమ్మను లాక్కొనేందుకు పోలీసులు ప్రయత్నించారు. అనంతరం నేతలను పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌లకు తరలించారు. దీనికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో దర్శనమిచ్చాయి. 

* ఈశాన్య ఢిల్లీలో గత మూడు రోజులుగా జరిగిన ఆందోళనలు ప్రస్తుతం అదుపులోకి వచ్చాయి. 
* కర్ఫ్యూ విధించడంతో పాటు..కనిపిస్తే..కాల్చివేత ఉత్తర్వులు అమలు చేశారు. 
* ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. 

* అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో క్లీనింగ్ పనులు. 
* ఆందోళనల్లో నడిరోడ్లపై ఆహుతైన వాటిని తొలగింపు. 
* మృతుల సంఖ్య క్రమేపీ పెరుగుతోంది. 

* మృతుల సంఖ్య 35కి పెరిగింది. 
* పలు ప్రాంతాల్లో పాఠశాలలు, షాపులు మూసివేశారు. 
* అల్లర్లకు సంబంధించి 106 మంది అరెస్టు. 18 ఎఫ్ఐఆర్ నమోదు.