Hydrogen Train : ఇండియాలో హైడ్రోజన్ ట్రైన్ వచ్చేస్తోంది.. ఫస్ట్ ఈ రూట్‌లోనే.. టాప్ స్పీడ్ ఎంతంటే..

భారతదేశంలో తొలి హైడ్రోజన్ రైలు (Hydrogen Train) పరుగులు పెట్టేందుకు సిద్ధమైంది. త్వరలో ఈ రైలు ప్రయాణికులకు అందుబాటులోకి వస్తుందని ..

Hydrogen Train

Hydrogen Train : భారతదేశంలో తొలి హైడ్రోజన్ రైలు (Hydrogen Train) పరుగులు పెట్టేందుకు సిద్ధమైంది. త్వరలో ఈ రైలు ప్రయాణికులకు అందుబాటులోకి వస్తుందని రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF) వద్ద ఇటీవల హైడ్రోజన్ శక్తితో నడిచే డ్రైవింగ్ పవర్ కార్‌ పరీక్షలు విజయవంతంగా పూర్తి చేసిందని రైల్వే మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

Also Read: GST Slab: జీఎస్టీలో కీలక మార్పులు.. సబ్బులు నుంచి ఫోన్లు, ఏసీలు, రెడీ‌మేడ్ దుస్తులు వరకు.. ధర భారీగా తగ్గే వస్తువుల జాబితా ఇదే..

కేంద్ర ప్రభుత్వం గత ఏడాది హైడ్రోజన్‌ రైలు (Hydrogen Train) ప్రాజెక్టును ప్రకటించింది. 35 హైడ్రోజన్‌ రైళ్లను తయారు చేయాలని నిర్ణయించింది. ఈ ప్రాజెక్ట్ పర్యావరణ పరిరక్షణ కృషిలో చాలా కీలకం. ఇది డీజిల్ పై ఆధారపడటాన్ని తగ్గిస్తుంది. హైడ్రోజన్ వంటి శుభ్రమైన ఇంధనంతో డీజిల్ ను రీప్లేస్ చేయొచ్చు. దీని వలన కార్బన్ ఉద్గారాలు తగ్గి దేశానికి అవసరమైన ఇంధనాన్ని దిగుమతి చేసుకోవాల్సిన అవసరం తగ్గుతుంది. ఈ ప్రయత్నాన్ని భవిష్యత్ భారతాన్ని నిర్మించే ముఖ్యమైన అడుగు అని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.

Also Read: Indian Railways : ఇండియన్ రైల్వే సూపర్ టికెట్ బుకింగ్.. ఇక నుంచి జస్ట్ చిటికెలో టికెట్..!

హైడ్రోజన్ రైలు గురించి మీరు తెసుకోవాల్సిన విషయాలు..
♦ భారతదేశంలో మొట్టమొదటి హైడ్రోజన్ రైలు సర్వీస్ హర్యానాలోని జింద్ – సోవిపట్‌లను కలిపే మార్గంలో ప్రయాణిస్తుంది.
♦ ఈ రైలు రోజుకు రెండు ట్రిప్పులు వేస్తుంది. మొత్తం 356 కి.మీ. దూరాన్ని కవర్ చేస్తుంది.
♦ 10 కోచ్‌లతో కూడిన ఈ రైలు రోజుకు 2,600 మందికి పైగా ప్రయాణికులను తీసుకెళ్లగల సామర్థ్యంను కలిగి ఉంది.
♦ జర్మనీ, ఫ్రాన్స్, స్వీడన్, చైనాలతో పాటు హైడ్రోజన్ టెక్నాలజీతో నడిచే రైళ్లను నడుపుతున్న ఐదో దేశంగా భారత్ అవతరించనుంది.
♦ ఈ రైలు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన, పొడవైన హైడ్రోజన్ రైలు అవుతుంది.
♦ హైడ్రోజన్ రైలు ఇతర రైళ్ల కంటే భిన్నంగా ఉంటుంది. ఇది పూర్తిగా కాలుష్య రహితమైంది.
♦ ఈ రైలు గరిష్ఠంగా గంటకు 110 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది.
♦ చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF) లో మొట్టమొదటి హైడ్రోజన్‌ రైలు బోగీల తయారీ పూర్తయింది.
♦ ఇండియన్ రైల్వేస్ ఈ ప్రాజెక్టును “హైడ్రోజన్ ఫర్ హెరిటేజ్ ఇన్నోవేషన్” పేరుతో అభివృద్ధి చేస్తోంది. – ఈ ప్రాజెక్టులో భాగంగా, రెండు డీజిల్ పవర్ కార్లను హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ సిస్టమ్‌లతో రీట్రోఫిట్ చేస్తున్నారు. ప్రతి పవర్ కారు 220 కిలోల హైడ్రోజన్‌ను 350 బార్‌ల ఒత్తిడి వద్ద నిల్వ చేస్తుంది. హైడ్రోజన్ యొక్క అధిక మండే స్వభావం కారణంగా, బహుళ భద్రతా చర్యలు కూడా ఏర్పాటు చేయబడ్డాయి.
♦ ఇంధన కణాల ద్వారా ట్రాక్షన్ మోటార్లకు శక్తినిస్తుంది. హైడ్రోజన్ ను ఆక్సిజన్ తో కలపడం ద్వారా విద్యుత్ ను ఉత్పత్తి చేస్తుంది. ఉప ఉత్పత్తిగా నీటి ఆవిరిని మాత్రమే విడుదల చేస్తుంది.