Bilkis Bano case: బిల్కిస్ బానో నిందితుల విడుదల తప్పిదం: సొంత పార్టీపై బీజేపీ సీనియర్ నేత విమర్శలు

‘‘బిల్కిస్ బానో అత్యాచార నిందితులను విడుదల చేయడం పట్ల సిగ్గుతో నా తల వంచుకుంటున్నాను. చరిత్రలో ఇదొక కిరాతకమైన కేసు. కానీ ఇలాంటి నేరస్తులను విడుదల చేయడానికి ప్రభుత్వం ఎలా సహకరిస్తుంది? గుజరాత్ ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. అలాగే ఆ నేరస్తులను ఉరి తీయాలి’’ అని శాంత కుమార్ డిమాండ్ చేశారు. ఈ నేరస్తులకు శిక్ష పడేందుకు అవసరమైతే తాను ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలుస్తానని ఆయన పేర్కొన్నారు.

I bow my head in shame, hang Bilkis convicts says BJP ex CM Shanta Kumar

Bilkis Bano case: బిల్కిస్ బానో సామూహిక అత్యాచార నేరస్తులను కోర్టు విడుదల చేయడం పట్ల భారతీయ జనతా పార్టీ నేతలు ఎవరూ స్పందించడం లేదు. అయితే ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత శాంత కుమార్ ఈ విషయమై స్పందిస్తూ సొంత పార్టీని తప్పు పట్టారు. ఆ నేరస్తులను విడుదల చేయడం అత్యంత దారుణమని, ఈ చర్యకు సిగ్గుతో తన తల దించుకుంటున్నానని అన్నారు. 75 ఏళ్ల స్వాతంత్ర్య భారతంలో ఇది అత్యంత అవమానకరమైన సందర్భమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

‘‘బిల్కిస్ బానో అత్యాచార నిందితులను విడుదల చేయడం పట్ల సిగ్గుతో నా తల వంచుకుంటున్నాను. చరిత్రలో ఇదొక కిరాతకమైన కేసు. కానీ ఇలాంటి నేరస్తులను విడుదల చేయడానికి ప్రభుత్వం ఎలా సహకరిస్తుంది? గుజరాత్ ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. అలాగే ఆ నేరస్తులను ఉరి తీయాలి’’ అని శాంత కుమార్ డిమాండ్ చేశారు. ఈ నేరస్తులకు శిక్ష పడేందుకు అవసరమైతే తాను ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలుస్తానని ఆయన పేర్కొన్నారు.

‘‘ప్రత్యేక కోర్టు, హైకోర్టు వారు నేరస్తులను నిర్ధారించింది. అత్యాచారంతో పాటు హత్యలకు వారు పాల్పడ్డారని అన్ని ఆధారాలు ఉన్నాయి. వారు ఘోరమైన నేరాలకు పాల్పడ్డారు. కానీ ఇప్పటికీ వారికి ఉరిశిక్ష పడకపోగా వారిని విడుదల చేయడం నన్ను ఆశ్చర్యానికి గురి చేసింది. ప్రత్యేక సదుపాయాల్ని కల్పించి గుజరాత్ ప్రభుత్వం వారిని విడుదల చేసింది. 75 ఏళ్ల స్వాతంత్ర్య భారతంలో ఇది అత్యంత అవమానకరమైన సందర్భం. ఇన్నేళ్లైనా మహిళలు, బాలికలకు భద్రత లేదంటే అది మన తప్పిదమే’’ అని శాంత కుమార్ అన్నారు.

Bihar: బీజేపీ బలం తగ్గుతుందనగానే ఆ ముగ్గురు అల్లుళ్లు వస్తారు.. తేజశ్వీ విమర్శలు