నేను బ్రాహ్మిణ్.. చౌకీదార్ కాలేను : బీజేపీ ఎంపీ

ప్రధాని నరేంద్ర మోడీ చేపట్టిన చౌకీదార్ (నేనూ కాపలాదారు) అనే క్యాంపెయిన్ లో బీజేపి నేతలంతా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. మోడీ పిలుపు మేరకు నేతలంతా తమ పేర్ల ముందు చౌకీదార్ అనే పదాన్ని జోడించారు.

  • Publish Date - March 25, 2019 / 07:47 AM IST

ప్రధాని నరేంద్ర మోడీ చేపట్టిన చౌకీదార్ (నేనూ కాపలాదారు) అనే క్యాంపెయిన్ లో బీజేపి నేతలంతా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. మోడీ పిలుపు మేరకు నేతలంతా తమ పేర్ల ముందు చౌకీదార్ అనే పదాన్ని జోడించారు.

ప్రధాని నరేంద్ర మోడీ చేపట్టిన చౌకీదార్ (నేనూ కాపలాదారు) అనే క్యాంపెయిన్ లో బీజేపి నేతలంతా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. మోడీ పిలుపు మేరకు నేతలంతా తమ పేర్ల ముందు చౌకీదార్ అనే పదాన్ని జోడించారు. ఇప్పటికే ట్విట్టర్ అకౌంట్లలో తమ పేర్లకు ముందు చౌకీదార్ పదాన్ని చేర్చారు.

బీజేపీ ఎంపీ సుబ్రమణ్యన్ స్వామి మాత్రం తన ట్విట్టర్ అకౌంట్ లో పేరుకు ముందు చౌకీదార్ పదాన్ని జోడించలేదు. ఎందుకంటే.. తానొక బ్రాహ్మణ్ వ్యక్తిని అని.. అందుకే.. చౌకీదార్ అని మార్చుకోలేదు అని ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో స్వామి వ్యాఖ్యానించారు. చౌకీదార్ పై సుబ్రమణ్యన్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

ఆ వీడియోలో… ‘నేను చాకీదార్ ను కాలేను. ఎందుకంటే.. నేను బ్రాహ్మిణ్. బ్రాహ్మిణులు చౌకీదారులు కాలేరు. ఇది వాస్తవం. చౌకీదారులకు నేను ఆదేశాలు ఇస్తాను. అందుకే ప్రతిఒక్కరూ తమను చౌకీదారులుగా నియమించినట్టు భావిస్తుంటారు. అందులో నేను మాత్రం ఒకడని కాలేను’ అని అన్నారు.

గతవారం ప్రధాని మోదీ తాను చేపట్టిన నేనూకాపలాదారు కార్యక్రమంలో పార్టీ నేతలను పాల్గొనాల్సిందిగా కోరిన విషయం తెలిసిందే. ప్రధాని పిలుపుతో బీజేపీ చీఫ్‌ అమిత్‌ షా సహా పలువురు కేంద్ర మంత్రులు, పార్టీ సీనియర్‌ నేతలు ట్విటర్‌లో తమ పేర్ల ముందు చౌకీదార్‌ పదాన్ని జోడించారు. మరోవైపు ప్రధాని చౌకీదార్‌ క్యాంపెయిన్‌ను విపక్షాలు మాత్రం విమర్శలు గుప్పిస్తున్నాయి.