కరోనావైరస్‌తో ప్రపంచం అతలాకుతలం అవుతుంటే గో మూత్రం చాలు వైరస్ మాయమైపోతుందని.. రూమర్లు పుట్టిస్తున్నారు. ఏ రకంగా సర్టిఫై కాని ఈ సొంత వైద్యంతో ప్రజలను అపోహలకు గురి చేస్తున్నారని అలాంటి వ్యాఖ్యలు చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల అదుపులోకి తీసుకున్న తర్వాత తాను జోక్ చేశానని అందులో నిజం లేదని చెప్పుకొచ్చాడు.
ఈ ఘటన పశ్చిమబెంగాల్‌లో చోటు చేసుకుంది. నిందితుడిని హుగ్లీ జిల్లాకు చెందిన మమూద్ అలీగా గుర్తించారు. తాను ముస్లిం కాబట్టి.. ఫోకస్ ఉంచారని అంటున్నాడు. తాను చెప్పిన కారణంగానే తన ముస్లిం స్నేహితులు కూడా గో మూత్రం తాగారని అన్నాడు.
‘ఫేక్ న్యూస్ వ్యాప్తి చేయడం బాధ్యతగా తీసుకోలేదు. నేను ముస్లిం కాబట్టి దీనిని పెద్ద ఇష్యూ చేయాలనుకున్నా. అదే నేను హిందూ అయి ఉంటే దీనిని అంతగా పట్టించుకునేవారు కాదు. ఇది కేవలం సరదా కోసమే చేశా’ అని చెప్పుకొచ్చాడు.
దీంతో పాటు అతను గో మూత్రంగా తాగింది కేవలం నీరు మాత్రమే. ఆ ఫ్లేవర్ రావడం కోసం పానీ పూరీ లాంటి స్ట్రీట్ ఫుడ్ కు వాడే రసాన్ని కలిపాడు.