I don't understand what the shame in keep Nehru as their surname ask modi
PM Modi: గాంధీ కుటుంబ సభ్యులు నెహ్రూ పేరును ఎందుకు తమ పేరు చివర్లో పెట్టుకోలేదని, అంత అవమానకరంగా వాళ్లు ఎందుకు భావిస్తున్నారో అర్థం కావడం లేదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై జరిగిన చర్చలో భాగంగా బుధవారం లోక్‌సభను ఉద్దేశించి ప్రసంగించిన మోదీ, గురువారం రాజ్యసభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా బుధవారం కాంగ్రెస్ పార్టీ కీలక నేత రాహుల్ గాంధీ మోదీపై పలు ప్రశ్నలు సంధించారు. అనంతరం మోదీ ప్రసంగించినప్పటికీ ఆ ప్రసంగంతో తాను సంతృప్తిగా లేనని రాహుల్ అన్నారు.
PM Modi: అదానీని వదలని అపోజిషన్.. యూపీఏ స్కాంలను ఎకరువు పెట్టిన పీఎం మోదీ
ఇక గురువారం రాజ్యసభలో మోదీ మాట్లాడుతూ ‘‘ప్రభుత్వ పథకాలకు కొంత మంది వ్యక్తుల పేర్లు, సంస్కృత పదాలతో సమస్యలు ఉన్నాయి. గాంధీ-నెహ్రూ కుటుంబం పేర మీద 600 ప్రభుత్వ పథకాలు ఉన్నాయని నేను ఒక రిపోర్టులో చదివాను. చాలా పథకాలకు నెహ్రూ పేరు పెట్టారు. మరి వారి కుటుంబానికే చెందిన నెహ్రూని ఇంటిపేరుగా ఎందుకు పెట్టుకోలేదో నాకు అర్థం కావడం లేదు. భయమా లేదంటే అవమానకంగా భావిస్తున్నారా?’’ అని మోదీ ప్రశ్నించారు.
Twitter Blue: ఇండియాలోనూ బ్లూటిక్ వెరిఫికేషన్ ప్రారంభించనున్న ట్విట్టర్.. నెలవారి రుసుము ఎంతంటే?
ఇక దేశ సమస్యలపై కాంగ్రెస్ వైఖరి సరిగా లేదని మోదీ విమర్శలు గుప్పించారు. దేశానికి కాంగ్రెస్ శాశ్వత పరిష్కారాలు చూపలేదని, వారికి ఆ ఆలోచనే లేదని అన్నారు. ‘‘దేశాన్ని 60 ఏళ్లు కాంగ్రెస్ పార్టీ నిర్మించిందని మల్లికార్జున ఖర్గే చెప్పారు. 2014లో నేను మినట్ డీటెయిల్స్ చూశాను. 60 ఏళ్లలో కాంగ్రెస్ రోడ్డు మీద గుంతలు మాత్రమే నిర్మించింది. అంతకు మించి ఏమీ చేయలేదు. మేము సాంకేతికతను ఆధారం చేసుకుని పనిని బదిలీ చేస్తున్నాము. పని పెరగడమే కాకుండా పనితనంలో కూడా వేగాన్ని పెంచాము’’ అని మోదీ అన్నారు.