Uma Bharti: మీకు స్వేచ్ఛ ఉంది, ఎవరికైనా ఓటేయొచ్చు.. పార్టీ హార్డ్ కోర్ ఓట్ బ్యాంక్‭తో ఉమా భారతి వ్యాఖ్యలు, కలవరంలో బీజేపీ

ఉమా భారతి చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ సంచలనంగా మారాయి. ఈ వ్యాఖ్యలను బట్టి పార్టీ ఆమెను ఎంత నిర్లక్ష్యానికి గురి చేసిందో అర్థం చేసుకోవచ్చంటూ కాంగ్రెస్ అధికార ప్రతినిధి భూపేంద్ర గుప్త విమర్శించారు. హార్స్ ట్రేడింగ్ చేస్తూ పార్టీలోకి తెస్తున్న కొత్త వ్యక్తులకు పదవులు ఇస్తూ అద్వాణీ, ఉమా భారతి లాంటి వారిని పక్కన పెట్టారని అన్నారు. వాస్తవానికి కొంత కాలంగా ఆమె తీరు బీజేపీకి వ్యతిరేకంగానే కనిపిస్తోంది

Uma Bharti: పార్టీకి ఎప్పటి నుంచో బలమైన, నమ్మకమైన ఓటు బ్యాంకుగా ఉన్న ఒక వర్గం ప్రజలతో మాజీ ముఖ్యమంత్రి ఉమా భారతి తాజాగా చేసిన వ్యాఖ్యలు భారతీయ జనతా పార్టీని కలవరానికి గురి చేస్తున్నాయి. పార్టీ కార్యకర్తలలాగ ఓటర్లకు ఎలాంటి బంధనాలు లేవని, వారికి స్వేచ్ఛ ఉందని, ఎవరికైనా ఓటేయవచ్చని ఆమె అన్నారు. చుట్టూ చూసుకుని, అన్నీ ఆలోచించుకుని ఓటు వేయాలని ఒకటికి రెండుమార్లు ఆమె చెప్పడంపై సొంత పార్టీలోనే కలవరం మొదలైంది. ఉమా భారతి ఏ ఉద్దేశంతో ఈ వ్యాఖ్యలు చేశారు? ఆమె ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటూ విశ్లేషణలు ప్రారంభమయ్యాయి.

Pakistan Sell Embassy In US : అమెరికాలో రాయబార కార్యాలయ భవనాన్ని అమ్మకానికి పెట్టిన పాకిస్థాన్ .. టాప్ బిడ్లలో భారత్

మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోని లోధి సామాజిక వర్గం ఏనాటి నుంచో భారతీయ జనతా పార్టీకి నమ్మకమైన ఓటు బ్యాంకుగా ఉంటూ వస్తున్నారు. ఓబీసీ కులాల సమూహంలోకి వచ్చే సామాజిక వర్గం నుంచే ఉమా భారతి వచ్చారు. అయితే తాజాగా మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‭లో జరిగిన ఓ కార్యక్రమంలో లోధి సామాజిక వర్గాన్ని ఉద్దేశించి ఉమా భారతి ప్రసంగిస్తూ “నా పార్టీ వేదికపైకి వచ్చి ప్రజలను ఓట్లు అడుగుతాను. ఆ క్రమంలో నేనెవరినీ నువ్వు లోధివా అని అడగను. నేను లోధి అని కూడా చెప్పను. బీజేపీకి ఓటేయమని మాత్రం అడుగుతాను. ఎందుకంటే నా పార్టీకి నమ్మకమైన సైనికురాలిని నేను. అందుకే మా పార్టీకి ఓటు వేయమని ప్రతి ఒక్కరికీ చెబుతున్నాను’’ అని అన్నారు.

Heeraben Modi: ప్రధాని మోదీ తల్లి హీరాబెన్‌కు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు

ఇంకా ఆమె మాట్లాడుతూ ‘‘మీ చుట్టూ ఉన్న అభిరుచులు చూసుకోవాలి. అందరికీ ఒకే రకమైన అభిరుచులు ఉండవు. గుర్తుంచుకోండి, మేము మా ప్రేమ (పార్టీ) బంధానికి కట్టుబడి ఉన్నాము. కానీ నేను అనుకునేదేంటంటే, మీరు ఎటువంటి రాజకీయ బంధాలలో లేరు. ఒకటికి రెండు సార్లు ఆలోచించుకుని ఎవరికి ఓటేయాలో నిర్ణయించుకోండి’’ అని అన్నారు. ఆ సమయంలో వేదికపై బీజేపీ ఎమ్మెల్యే ప్రద్యుమన్ సింగ్ లోధీ, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ సోదరుడు ఎమ్మెల్యే జలం సింగ్ పటేల్ ఉన్నారు.

Yatra Breach: రాహుల్ భద్రతపై కాంగ్రెస్ ఆందోళన.. భద్రత కల్పించాలంటూ అమిత్ షాకు లేఖ

అయితే ఉమా భారతి చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ సంచలనంగా మారాయి. ఈ వ్యాఖ్యలను బట్టి పార్టీ ఆమెను ఎంత నిర్లక్ష్యానికి గురి చేసిందో అర్థం చేసుకోవచ్చంటూ కాంగ్రెస్ అధికార ప్రతినిధి భూపేంద్ర గుప్త విమర్శించారు. హార్స్ ట్రేడింగ్ చేస్తూ పార్టీలోకి తెస్తున్న కొత్త వ్యక్తులకు పదవులు ఇస్తూ అద్వాణీ, ఉమా భారతి లాంటి వారిని పక్కన పెట్టారని అన్నారు. వాస్తవానికి కొంత కాలంగా ఆమె తీరు బీజేపీకి వ్యతిరేకంగానే కనిపిస్తోంది. రాష్ట్రంలో మద్యం నిషేధించాలంటూ పెద్ద ఎత్తున ఆమె ఆందోళన చేపట్టారు (రాష్ట్రంలో బీజేపీయే అధికారంలో ఉంది). అంతే కాకుండా పార్టీ కార్యక్రమాల్లో కూడా ఆమె పెద్దగా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో తాజా వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

ట్రెండింగ్ వార్తలు