Pakistan Sell Embassy In US : అమెరికాలో రాయబార కార్యాలయ భవనాన్ని అమ్మకానికి పెట్టిన పాకిస్థాన్ .. టాప్ బిడ్లలో భారత్

అమెరికాలోని వాషింగ్టన్‌లో ఉన్న తన దౌత్య కార్యాలయ భవనాన్ని అమ్మకానికి పెట్టింది పాకిస్థాన్ .. దీని కోసం బిడ్లను ఆహ్వానించగా పలు బిడ్లు దాఖలయ్యాయి. టాప్ బిడ్లలో భారత్ కు చెందిన సంస్థ కూడా ఉంది.

Pakistan Sell Embassy In US : అమెరికాలో రాయబార కార్యాలయ భవనాన్ని అమ్మకానికి పెట్టిన పాకిస్థాన్ .. టాప్ బిడ్లలో భారత్

Pakistan decides to sell embassy building in US

Updated On : December 28, 2022 / 11:51 AM IST

Pakistan sell embassy building in US : పాకిస్థాన్ ఆర్థిక సంక్షోభం నుంచి బయటకు రాలేకపోతోంది. ఈక్రమంలో పాకిస్థాన్ అమెరికాలో ఉన్న తన రాయబార కార్యాలయం భవాన్ని అమ్మకానికి పెట్టింది. దీని కోసం బిడ్లను కూడా ఆహ్వానించింది. దేశంలో ఆర్థిక పరిస్థితి నానాటికీ క్షీణిస్తున్న క్రమంలో తమకు విదేశాల్లో ఉన్న ఆస్తుల్ని అమ్మకానికి పెట్టింది. దీంట్లో భాగంగానే అమెరికాలోని తన రాజబార కార్యాలయ భవనాన్ని అమ్మాకానికి పెట్టింది.

గతంలో పాకిస్థాన్ రక్షణ శాఖ విభాగం కార్యకలాపాలు కొనసాగించిన అమెరికా రాజధాని వాషింగ్టన్‌లో ఉన్న తన దౌత్య కార్యాలయ భవనాన్ని అమ్మకానికి పెట్టింది. ఈ భవనం అమ్మకం కోసం బిడ్లను ఆహ్వానించగా మూడు బిడ్లు దాఖలైయ్యాయని డాన్ దినపత్రిక వెల్లడించింది. ఈ మూడు బిడ్లలో ఒక బిడ్ యూదులకు చెందిన సంస్థ కాగా మరొకటి భారత్ కు చెందిన ఓ రియల్ ఎస్టేట్ సంస్థ ఉంది. అలాగే పాకిస్థాన్ కు చెందిన ఓరియల్డర్ కూడా బిడ్ దాఖలు చేశారు. అత్యధికంగా (6.8 million dollars) రూ.56 కోట్లకు యూదులకు చెందిన ఓ సంస్థ బిడ్ వేసింది.

భారత్ కు చెందిన ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి (5 million dollars)రూ.41 కోట్లకు బిడ్ దాఖలు చేయగా, పాకిస్థానీ రియల్టర్ ఒకరు 4 million dollarsకు అంటూ భారత కరెన్సీలో రూ.33 కోట్లకు బిడ్ వేశారు. వాషింగ్టన్ లోని మూడు చోట్ల పాకిస్థాన్ దౌత్య విభాగానికి ఆస్తులు ఉన్నాయి. వాటిలో ఒకదాన్ని అమ్మకానికి పెట్టిందని పాకిస్థాన రాయబార కార్యాలయం అధికారులు డాన్ కు తెలిపారు.