నేను ఏపార్టీలోను చేరటం లేదు : సంజయ్ దత్ 

  • Publish Date - August 27, 2019 / 06:58 AM IST

బాలీవుడ్ హీరో సంజ‌య్ ద‌త్  మళ్లీ రాజ‌కీయాల‌లోకి రాబోతున్న‌ట్టు జోరుగా ప్ర‌చారం జరుగుతోంది. ఈ వార్తలు నిజమని నమ్మేలా కొన్ని సందర్భాలు కూడా జరిగాయి. సంజయ్ దతత్ రాష్ట్రీయ సమాజ్ పక్ష పార్టీ నేత మహాదేవ్ జంకర్‌ను సంజ‌య్ కలవటం..అనంతరం మహాదేశ్ మీడియాతో సంజయ్ దత్ తమ పార్టీలో చేరబోతున్నట్లుగా ప్రకటించేశారు. దీంతో ఖల్ నాయక్ మరోసారి పొలిటికల్ ఎంట్రీ ఖరారైనట్లుగా అందరూ భావించారు. దీనిపై ప్రచారం కూడా జోరుగా సాగింది. ఈ విషయంపై సంజయ్ దత్ క్లారిటీ ఇచ్చాడు.  

నేను ఏ రాజ‌కీయ పార్టీలో చేర‌డం లేదంటూ క్లారిటీ ఇచ్చేశాడు. మ‌హ‌దేవ్ శంక‌ర్ నాకు ఆప్త‌మిత్రుడు. తనకు మహాదేవ్ సోద‌రుడివంటివారనీ..ఆయ‌న భవిష్య‌త్ మంచిగా ఉండాల‌ని కోరుకుంటున్నాన‌ని తెలిపారు. సంజ‌య్  స్టేట్‌మెంట్‌తో  ఊహాగానాల‌కి పులిస్టాప్ ప‌డిపోయింది. ప్ర‌స్తుతం సంజ‌య్ తెలుగు సూప‌ర్ హిట్ చిత్రం ప్ర‌స్థానం రీమేక్‌లో న‌టిస్తున్నారు. ఇదే పేరుతో తెర‌కెక్కుతున్న ఈ చిత్రాన్ని దేవాకట్టా తెర‌కెక్కిస్తున్నాడు. తెలుగు వ‌ర్షెన్‌కి కూడా దేవా క‌ట్టానే డైరెక్ట్ చేసిన విష‌యం తెలిసిందే. కాగా..2009 లోక్ స‌భ ఎన్నిక‌ల‌లో స‌మాజ్ వాద్ పార్టీ అభ్య‌ర్ధిగా ల‌క్నో నుండి పోటీ చేసి ఓడిపోయిన సంజ‌య్ మ‌ళ్ళీ రాజ‌కీయాల వైపు చూడ‌లేదు. రీసెంట్‌గా మహాదేవ్ జంకర్‌ను కలవంటో వార్తలు హల్ చల్ చేసిన వార్తలపై క్లారిటీ ఇచ్చేశారు. 

సంజ‌య్ స్టేట్‌మెంట్‌తో అన్ని ఊహాగానాల‌కి పులిస్టాప్ ప‌డింది. ప్ర‌స్తుతం సంజ‌య్ తెలుగు సూప‌ర్ హిట్ చిత్రం ప్ర‌స్థానం రీమేక్‌లో న‌టిస్తున్నారు. ఇదే పేరుతో తెర‌కెక్కుతున్న ఈ చిత్రాన్ని దేవాకట్టా తెర‌కెక్కిస్తున్నాడు. తెలుగు వ‌ర్షెన్‌కి కూడా దేవా క‌ట్టానే డైరెక్ట్ చేసిన విష‌యం విదిత‌మే.