అమర జవాను తండ్రి భావోద్వేగం : పెద్దకొడుకు చనిపోతే ఏంటీ.. రెండో వాడ్నీ పంపిస్తా

  • Publish Date - February 15, 2019 / 05:53 AM IST

జమ్ము కశ్మీర్‌లోని పుల్వామా జిల్లా గరిపొరా ప్రాంతంలో గురువారం CRPF జవాన్ల బస్సుపై ఉగ్రవాదులు IED (ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్)తో ఆత్మాహుతి దాడికి తెగబడ్డ సంగ‌తి తెలిసిందే. 40మంది జవాన్లు అమరులయ్యారు. వీరిలో బీహార్‌కు చెందిన జవాన్లు కూడా ఉన్నారు. 

భాగల్‌పూర్‌కు చెందిన రతన్ ఠాకూర్ కుమారుడు కూడా ప్రాణాలు కోల్పోయాడు. తన కొడుకు చనిపోయాడన్న విషయాన్ని ఆ తండ్రి జీర్ణించుకోలేకపోతున్నారు. ‘నా కొడుకు దేశం కోసం, భరతమాత కోసం ప్రాణాలర్పించాడు. ఓవైపు బాధను దిగమింగుతూనే.. ఓ తండ్రిగా ఎంతో గర్వపడుతున్నా అని చెబుతున్నాడు. నా కొడుకు వంటి ఎందరో జవాన్లను చంపి.. తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చిన పాకిస్థాన్‌కు తగిన గుణపాఠం చెప్పాలన్నాడు.  

రతన్ ఠాకూర్ దేశానికి తగిన గుణపాఠం చెప్పడానికి తన కొడుకు చనిపోయాడన్న విషయాన్ని కూడ మర్చిపోయి రెండో కుమారుడ్ని సైన్యంలోకి పంపిస్తా’ అంటూ భావోద్వేగానికి గురయ్యారు. దేశభక్తి జవాన్లకే కాదు.. వాళ్ల కుటుంబ సభ్యులకు కూడా నరనరానా ఉంటుందనడానికి ఈ ఘటనే నిదర్శనం.