Endangered Nilgiri Tahr Viral Pic : నీల‌గిరి కొండ‌ల చెట్టు చిటారు కొమ్మ‌ మీద అంత‌రించిపోతున్న వన్యప్రాణి

నీల‌గిరి కొండ‌లు. పచ్చని ప్రకృతికి ఆలవాలం. ఎత్తైన రాతి కొండలు నిట్టనిలువుగా భూమిలోంచి దూసుకొచ్చాయా అనిపిస్తాయి. ఈ నీలగిరి కొండలు ఎన్నో పక్షులకు,వన్యప్రాణులకు ఆలవాలంగా ఉన్నాయి. అటువంటి నీలగిరి కొండలను అవలీలగా ఎక్కేసే ఓ వన్యప్రాణి కొండల కొసన ఓ చెట్టు కొమ్మపై నిలబడి ఉన్న ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Nilgiri Tahr Viral Pic

Endangered Nilgiri Tahr : నీల‌గిరి కొండ‌లు. పచ్చని ప్రకృతికి ఆలవాలం. ఎత్తైన రాతి కొండలు నిట్టనిలువుగా భూమిలోంచి దూసుకొచ్చాయా అనిపిస్తాయి. ఈ నీలగిరి కొండలు ఎన్నో పక్షులకు,వన్యప్రాణులకు ఆలవాలంగా ఉన్నాయి. అటువంటి నీలగిరి కొండలను అవలీలగా ఎక్కేసే ఓ వన్యప్రాణి కొండల కొసన ఓ చెట్టు కొమ్మపై నిలబడి ఉన్న ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఐఏఎస్ ఆఫీస‌ర్‌ సుప్రియా సాహూ ట్విట్ట‌ర్‌లో షేర్ చేసిన ‘నీల‌గిరి త‌హ‌ర్’ ఫొటోలు సోష‌ల్‌మీడియాలో ఆకట్టుకుంటున్నాయి.

అంత‌రించిపోయే ద‌శ‌లో ఉన్న వ‌న్య‌ప్రాణి ఫోటో నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. ఈ వన్య ప్రాణులు నిట్టనిలువగా ఉండే కొండలను అవలీలగా ఎక్కేయటమే కాదు చిటారు కొమ్మలకు కూడా అవలీలగా ఎక్కేస్తాయి. అటువంటి ఓ ‘తహర్’ ఫోటోని సుప్రియా సాహు తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ‘నిజ‌మైన ఖ‌త్రోం కే ఖిలాడీ. ప‌శ్చిమ క‌నుమ‌ల్లోని షోల ప‌చ్చిక‌బ‌య‌ళ్లలో నివ‌సిస్తాయి. ఎత్తైన కొండ‌ల్ని కూడా అవ‌లీల‌గా ఎక్కేస్తాయి. వీటి కాళ్లకు ఉండే గిట్టలు కొండల్ని ఎక్కటానికి చక్కగా ఉపయోగపతాయి. అంతరించిపోతున్న ఈ వన్యప్రాణుల సంర‌క్ష‌ణ‌కు త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం ప్రాజెక్టు మొద‌లు పెట్టినందుకు చాలా సంతోషంగా ఉంది ‘ అంటూ ఆ ఫొటోల‌కు ఆమె క్యాప్ష‌న్ పెట్టారు.

సుప్రియా సాహూ ప‌చ్చ‌ద‌నం ప‌రుచుకున్న నీల‌గిరి కొండ‌ల మీదున్న ఒక చెట్టు కొమ్మ‌ మీద త‌హ‌ర్ ఒక‌టి నిల్చొని ఉంది. మ‌రికొన్ని తహర్లు ఆ ప‌క్క‌నే ఉన్న కొండ మీద నిల్చొని ఉన్నాయి. అంత‌రించిపోయే ద‌శ‌లోని జంతువు ఫొటోలు షేర్ చేసిన త‌మిళ‌నాడు రాష్ట్ర జంతువు అయిన త‌హ‌ర్ అంత‌రించిపోయే ద‌శ‌లో ఉండటంతో ఈ జంతువును సంర‌క్షించేందుకు త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం చ‌ర్య‌లు చేప‌ట్టింది. ఒవిస్ జాతికి చెందిన గొర్రెల‌ను పోలిన వీటి కొమ్ములు వంపు తిరిగి ఉంటాయి. ఇవి నీల‌గిరి అడువుల్లోనే ఎక్కువ‌గా క‌నిపిస్తాయి. అందుకే వీటిని నీలగిరి తహర్ అంటారు.