ICC Shocked Indian Cricket Team : భారత క్రికెట్ జట్టుకు ఐసీసీ షాక్.. మ్యాచ్ ఫీజులో 80శాతం కోత

భారత్ జట్టుకు ఐసీసీ షాక్ ఇచ్చింది. స్లో ఓవర్ రేట్ కారణంగా సోమవారం భారత క్రికెట్ జట్టుకు మ్యాచ్ ఫీజులో 80 శాతం కోత విధించారు. టీమిండియా నిర్ణీత సమయానికి 4 ఓవర్లు తక్కువగా బౌలింగ్ చేసినట్లు మ్యాచ్ రిఫరీ రంజన్ ముదగల్లే గుర్తించారు.

Indian cricket team

ICC Shocked Indian Cricket Team : భారత్-బంగ్లాదేశ్ మధ్య తొలి మ్యాచ్ ఢాకాలోని షేర్-ఏ-బంగ్లా స్టేడియంలో జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో బంగ్లాదేశ్ ఒక వికెట్ తేడాతో గెలుపొందింది. భారత్ జట్టుకు ఐసీసీ షాక్ ఇచ్చింది. స్లో ఓవర్ రేట్ కారణంగా సోమవారం భారత క్రికెట్ జట్టుకు మ్యాచ్ ఫీజులో 80 శాతం కోత విధించారు. టీమిండియా నిర్ణీత సమయానికి 4 ఓవర్లు తక్కువగా బౌలింగ్ చేసినట్లు మ్యాచ్ రిఫరీ రంజన్ ముదగల్లే గుర్తించారు.

ఐసీసీ ప్రవర్తనా నియమావళిలో నిబంధన 2.22 ప్రకారం ఓవర్ ఆలస్యమైనందుకు క్రీడాకారుల మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత విధించనుండగా మ్యాచ్ లో నాలుగు ఓవర్లు ఆలస్యం కావడంతో 80 శాతం కోత విధించారు. ఈ మ్యాచ్ లో భారత జట్టు 41.2 ఓవర్లలో 186 పరుగులకే కుప్పకూలింది. రోహిత్ శర్మ 27, శ్రేయాస్ అయ్యర్ 24, వాషింగ్టన్ సుందర్ 19 పరుగులు చేశారు. శిఖర్ ధావన్ 7, విరాట్ కోహ్లీ 9 పరుగుల చొప్పున చేశారు.

MS Dhoni Income Tax: క్రికెట్‌కు రిటైర్మెంట్ తర్వాత ధోనీ ఆదాయం తగ్గిందా? పెరిగిందా..? ఆదాయపు పన్ను వివరాలు ఏం చెబుతున్నాయంటే?

షాబాజ్ అహ్మద్, దీపక్ చాహర్ ఖాతా కూడా తెరవకుండా పెవిలియన్ కు చేరుకున్నారు. ఇకపోతే బంగ్లదేవ్ బౌలర్ షకీబ్ అల్ హసన్ 5 వికెట్లు, ఇబాదత్ హుస్సేన్ 4 వికెట్లు తీశారు. అనంతరం బంగ్లాదేశ్ 46 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి లక్ష్యాన్ని చేధించింది. కెప్టెన్ లిటన్ దాస్ 41 పరుగులు చేశాడు. మెహ్దీ 38 పరుగులతో అజేయ ఇన్నింగ్స్ తో జట్టును గెలిపించాడు.