MS Dhoni Income Tax: క్రికెట్‌కు రిటైర్మెంట్ తర్వాత ధోనీ ఆదాయం తగ్గిందా? పెరిగిందా..? ఆదాయపు పన్ను వివరాలు ఏం చెబుతున్నాయంటే?

2020 ఆగస్టు 15న అంతర్జాతీయ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్‌ల నుండి ఆటగాడిగా దూరమైనప్పటికీ ధోని బిజినెస్ పిచ్‌లో గొప్ప ఇన్నింగ్స్‌ను ఆడుతున్నాడు. రిటైర్మెంట్ తర్వాత ధోని వ్యాపార ప్రపంచంలో కొత్త విజయాల మెట్లు ఎక్కుతున్నాడు. వ్యాపార విస్తరణతో, అతని వ్యక్తిగత ఆదాయం నిరంతరం పెరుగుతోంది.

MS Dhoni Income Tax: క్రికెట్‌కు రిటైర్మెంట్ తర్వాత ధోనీ ఆదాయం తగ్గిందా? పెరిగిందా..? ఆదాయపు పన్ను వివరాలు ఏం చెబుతున్నాయంటే?

MS Dhoni

MS Dhoni Income Tax: మహేందర్ సింగ్ ధోనీ.. క్రికెట్ గురించి తెలిసిన ప్రతీఒక్కరికి ఈ పేరు సుపరిచితమే. భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ధోనీ బెస్ట్ కెప్టెన్‌గానేకాక బెస్ట్ ఫినిషర్‌గా పేరు తెచ్చుకున్నాడు. ధోని తన కెప్టెన్సీ‌లో టీమ్ ఇండియాకు రికార్డు స్థాయిలో విజయాలను తెచ్చిపెట్టాడు. క్రికెట్‌లో విజయవంతమైన ప్లేయర్‌గా, కెప్టెన్‌గా పేరుగడించిన ధోనీ.. సంపాదనలోనూ అంతేస్థాయిలో పేరుగడించాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన తరువాత ధోనీ ఆదాయం పెరిగిందా? తగ్గిందా? అంటే గతంకంటే పెరిగిందని అతని ఆదాయపు పన్ను వివరాలు తెలుపుతున్నాయి.

Mahendra Singh Dhoni: సౌత్ సినిమాలపై కన్నేసిన మహేంద్ర సింగ్ ధోని!

2020 ఆగస్టు 15న అంతర్జాతీయ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్‌ల నుండి ఆటగాడిగా దూరమైనప్పటికీ ధోని బిజినెస్ పిచ్‌లో గొప్ప ఇన్నింగ్స్‌ను ఆడుతున్నాడు. రిటైర్మెంట్ తర్వాత ధోని వ్యాపార ప్రపంచంలో కొత్త విజయాల మెట్లు ఎక్కుతున్నాడు. వ్యాపార విస్తరణతో, అతని వ్యక్తిగత ఆదాయం నిరంతరం పెరుగుతోంది. ఆదాయపు పన్ను శాఖ ఫైల్ ఈ విషయాన్ని ధృవీకరిస్తోంది. ఇప్పటికే ధోనీ అనేక కంపెనీలలో పెట్టుబడి పెట్టాడు. రాంచీలో దాదాపు 43ఎకరాల్లో సేంద్రియ వ్యవసాయం చేస్తున్నాడు. ఇటీవల, అతను గరుడ ఏరోస్పేస్ భాగస్వామ్యంతో డ్రోన్ ఉత్పత్తి కోసం ద్రోణి అనే వెంచర్‌ను ప్రారంభించాడు. ధోనీ, అతని భార్య ఒక చలనచిత్ర నిర్మాణ సంస్థను కూడా స్థాపించారు. బెంగళూరులోని MS ధోని గ్లోబల్ స్కూల్ కూడా ఈ సంవత్సరం ప్రారంభించబడింది.

Girl Swinging For Mountain: బాబోయ్.. ఈ బుడ్డదానికి ధైర్యం ఎక్కువే.. పెద్దవాళ్ల తరహాలో సాహసాలు చేస్తుంది..

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధభాగంలో అంటే ఏప్రిల్ నుండి అక్టోబర్ 2022 వరకు ఆదాయపు పన్నుశాఖలో అడ్వాన్స్ ట్యాక్స్ కింద రూ. 17కోట్లను ధోనీ జమ చేశారు. గత ఆర్థిక సంవత్సరంలో ఈ కాలానికి అడ్వాన్స్ ట్యాక్స్ కింద రూ.13 కోట్లు చెల్లించారు. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి వీరి ఆదాయంలో దాదాపు ముప్పై శాతం పెరుగుదల ఉండొచ్చని స్థూలంగా అంచనా. గత కొన్నేళ్లుగా ధోని ఆదాయపు పన్ను దాఖలు వివరాలు చూస్తే.. అతను 2021-22 సంవత్సరానికి ఆదాయపు పన్నుశాఖకు రూ. 38కోట్ల పన్ను చెల్లించాడు. అంటే ఈ ఏడాది ఆయన మొత్తం ఆదాయం దాదాపు 130 కోట్లు. 2020-21 సంవత్సరంలో దాదాపు 30కోట్లు, 2019-20, 2018-19 సంవత్సరాల్లో 28 కోట్లు, 2017-18లో రూ.12.17 కోట్లు, 2016-17లో రూ.10.93 కోట్లు ఆదాయపు పన్నును ధోనీ చెల్లించాడు. ధోనీ తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌ను ప్రారంభించినప్పటి నుండి జార్ఖండ్‌లో వ్యక్తిగత విభాగంలో అత్యధిక ఆదాయపు పన్ను చెల్లింపుదారుగా స్థిరంగా కొనసాగుతున్నాడు.