Girl Swinging For Mountain: బాబోయ్.. ఈ బుడ్డదానికి ధైర్యం ఎక్కువే.. పెద్దవాళ్ల తరహాలో సాహసాలు చేస్తుంది..

సైలాకు మూడున్నరేళ్లు. కానీ చిన్నారి పర్వతాల పైనుంచి రోప్‌ సాయంతో అటూఇటూ ఊగుతుంది. సాధారణంగా ఇలాంటి సాహసాలు చేయాలంటే పెద్దవాళ్లకుసైతం ఒంటిలో వణుకు వస్తుంది. తాజాగా ఈ చిన్నారి పర్వతంపై నుంచి రోప్ సహాయంతో స్వింగ్ చేస్తున్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది.

Girl Swinging For Mountain: బాబోయ్.. ఈ బుడ్డదానికి ధైర్యం ఎక్కువే.. పెద్దవాళ్ల తరహాలో సాహసాలు చేస్తుంది..

Girl Swinging For Mountain

Girl Swinging For Mountain: తల్లిదండ్రులు చిన్న పిల్లలను చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. వారి ప్రతీ కదిలికను గమనిస్తుంటారు. ముఖ్యంగా వారికి పదేళ్లువచ్చేవరకు ప్రతీదానిలో తల్లిదండ్రులు జాగ్రత్తలు చెబుతుంటారు. ఏదైనా వయస్సుకు మించి పనుల జోలికి వెళ్లనివ్వరు. కానీ, పర్వతారోహకులు మైక్, జానెల్లే స్మైలీలు మాత్రం వారి మూడేళ్ల కుమార్తె సైలాను సాధారణ పిల్లల్లాకాకుండా, చిన్నవయస్సులోనే పెద్దలుకూడా సాహసించలేని ప్రమాదకర కార్యకలాపాలకు ప్రోత్సహించారు.

Diabetes In Children : పిల్లల్లో మధుమేహం లక్షణాలను గుర్తించటం ఎలా?

సైలాకు మూడున్నరేళ్లు. కానీ చిన్నారి పర్వతాల పైనుంచి రోప్‌ సాయంతో అటూఇటూ ఊగుతుంది. సాధారణంగా ఇలాంటి సాహసాలు చేయాలంటే పెద్దవాళ్లకుసైతం ఒంటిలో వణుకు వస్తుంది. తాజాగా ఈ చిన్నారి పర్వతంపై నుంచి రోప్ సహాయంతో స్వింగ్ చేస్తున్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. ఈ వీడియోలో సైలా ఓ తాడుతో పెద్దటి పర్వతంపై నుంచి ఊయల ఊగినట్లు ఊగింది. ఈ వీడియోను షేర్ చేసిన కొద్ది గంటల్లోనే 37 మిలియన్లకుపైగా వీక్షించారు. సుమారు తొమ్మిది లక్షల మంది లైక్ చేశారు. చాలా మంది ఈ చిన్నారి సాహసాన్ని చూసి వణిపోయినట్లు తెలిపారు.

 

View this post on Instagram

 

A post shared by Mark Smiley (@smileysproject)

ఈ వీడియోను సైలా తల్లి చిత్రీకరించింది. దీనిని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టుచేసి మా మూడున్నరేళ్ల కుమార్తె సైలా తాడును సాయంతో అతిపెద్ద సాహసాన్ని చేసింది. ఇది చాలా అద్భుతంగా ఉంది. ఇప్పటివరకు చేసిన పర్యటనలో హైలైట్” అనే క్యాప్షన్‌ను వారు పంచుకున్నారు. అయితే, సైలా తల్లి తనకుమార్తె చేసిన దానికి మద్దతు ఇచ్చినప్పటికీ.. ఇందులో ఉన్న ప్రమాదం గురించికూడా హెచ్చరించింది. చాలా విషయాల్లో ఇలాంటి సాహసాలు చేసినప్పడు జాగ్రత్తగా ఉండాలని, లేకుంటే ప్రాణాలకే ప్రమాదం ఏర్పడుతుందని తెలిపింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు చిన్నారిని అభినందిస్తున్నారు. మరికొందరు నెటిజన్లు ఇది అధ్బుతం, ఈ చిన్నారి మీలాంటి తల్లిదండ్రులను కలిగి ఉండటం చాలా అదృష్టవంతురాలు అంటూ పేర్కొంటున్నారు.