Icmr Drops Two Medicines From Covid Treatment
ICMR drops two medicines from covid treatment : కొవిడ్ చికిత్సలో ఉపయోగించే రెండు మెడిసిన్స్ ను తొలగిచింది ఐసీఎంఆర్. కోవిడ్ చికిత్సకు సంబంధించి తాజా మార్గదర్శకాలు జారీ చేసిన భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) కరోనా చికిత్సలో ఉపయోగించే మెడిసిన్స్ లిస్టు నుంచి ఐవర్ మెక్టిన్, హైడ్రాక్సీక్లోరోక్విన్ లను తొలగించింది. ఐసీఎంఆర్ కు చెందిన నేషనల్ టాస్క్ ఫోర్స్ జాయింట్ మోనిటరింగ్ గ్రూప్ ఈ నిర్ణయం తీసుకుంది. పెద్దవాళ్లకు కొవిడ్ చికిత్స మార్గదర్శకాల సవరణలో ఈ రెండు మెడిసిన్స్ ఇకపై కోవిడ్ చికిత్సకు వినియోగించకూడదని వెల్లడించింది.
Read more : ICMR New Guidelines : కరోనా టెస్టులపై ఐసీఎంఆర్ కొత్త మార్గదర్శకాలు ఇవే..
కరోనా సోకినవారికి డాక్టర్లు చికిత్సలో భాగంగా రెమ్ డిసివిర్ ఇంజెక్షన్లు ఇచ్చేవారు. కానీ ఇకనుంచి ఈ ఐవర్ మెక్టిన్, హైడ్రాక్సీక్లోరోక్విన్ లను ఇకనుంచి కోవిడ్ చికిత్సకు ఉపయోగించకూడదని ఐసీఎంఆర్ స్పష్టంచేసింది. కాగా ప్రత్యేక సందర్భంల్లో మాత్రమే ఈ రెమ్ డిసివిర్, టోసిలిజుమాబ్ మెడిసిన్స్ ను వాడాలని స్పష్టం చేసింది. కొవిడ్ లక్షణాలు తీవ్రస్థాయిలో ఉన్న రోగులకు మాత్రమే రెమ్ డెసివిర్, టోసిలిజుమాబ్ ఔషధాలతో కూడిన చికిత్స అందించాలని ఐసీఎంఆర్ అనుబంధ విభాగం తెలిపింది.
కాగా కోవిడ్-19 నిబంధనల్ని మాత్రం కొనసాగించాల్సిందేనని ఈ సందర్భంగా ఐసీఎంఆర్ స్పష్టంచేసింది. మాస్కులు,శారీరక శుభ్రతతో పాటు పరిశసరాల పరిశుభ్రత, శానిటైజర్ వినియోగం వంటివి తప్పనిసరి అని తెలిపింది. అలాగే భౌతిక దూరం అనేది కూడా పాటించాలని వెల్లడించింది. కోవిడ్ నియంత్రణ కోసం తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకుంటునే ఇమ్యూనిటీని పెంచే ఆహారాలు తీసుకోవాలని సూచించింది.
Read more : Covid-19 : కొవిడ్ సోకిన గర్భిణుల్లో ఇన్పెక్షన్ ముప్పు ఎక్కువ!
రోగ లక్షణాలను బట్టి యాంటిపైరెటిక్, యాంటిట్యూసివ్ మరియు మల్టీవిటమిన్‌లను తీసుకోవచ్చు.అలాగే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లేదా హై-గ్రేడ్ జ్వరం లేదా తీవ్రమైన దగ్గు, ప్రత్యేకించి వంటివి ఎక్కువరోజులు ఉంటే వెంటనే డాక్టర్లను సంప్రదించాలని వారి సూచనల మేరకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఆందోళన పడకుండా ప్రశాంతంగా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని దేశ ప్రజలకు ఈ సందర్భంగా ఐసీఎంఆర్ సూచనలు చేసింది.