Iconic Week: నేటి నుంచి వారం రోజుల పాటు ఐకానిక్ వీక్
నేటి నుండి దేశవ్యాప్తంగా వారం రోజుల పాటు ఐకానిక్ వీక్ జరుపుకోవాలని కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రకటించారు.

Iconic Week
Iconic Week: నేటి నుండి దేశవ్యాప్తంగా వారం రోజుల పాటు ఐకానిక్ వీక్ జరుపుకోవాలని కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రకటించారు. ఆగస్టు 23 నుండి ‘ఆజాది కా అమృత్ మహోత్సవం’ జరుపుకోవడానికి అనేక కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. ఆగస్టు 29 వరకు ఈ కార్యక్రమాలు కొనసాగుతాయి.
అమృత్ మహోత్సవాల్లో భాగంగా వారం రోజుల పాటు ఈ ఐకానిక్ వీక్ సెలబ్రేట్ చేయనున్నారు. ఆధునిక భారత ప్రగతి యాత్ర, స్వాతంత్య్ర వీరుల చరిత్రపై ఈ వారం రోజుల పాటు ప్రచారం సాగించనున్నారు. ఇందులో భాగంగా దూరదర్శన్, ఆల్ ఇండియా రేడియోలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
మరోవైపు వెబినార్లు, సామాజిక మాధ్యమాల ద్వారా కూడా ప్రచారాలు సాగించనున్నారు. నాటకాలు, ఇంద్రజాల ప్రదర్శనలతో మారుమూల గ్రామాల్లో కూడా అవగాహన కల్పించనున్నారు. స్వాతంత్య్ర ఉద్యమంపై ప్రజలకు అవగాహన కల్పించడమే ముఖ్య ఉద్దేశ్యంగా ఈ ఐకానిక్ వీక్ జరుపనున్నారు.