చైనా అయినా, పాకిస్థాన్ అయినా.. వీ డోంట్ కేర్ అంటున్న భారత రక్షణశాఖ

Inida: డిఫెన్స్ లో అత్యాధునిక పరికరాలు సమకూర్చడమే కాకుండా.. బలగాల సంఖ్యను కూడా పెంచింది భారత్.

Army

తగ్గేదే లే అంటోంది నయా భారత్. ఎప్పుడూ శాంతి జపమే కాదు.. అవసరమైతే దేనికైనా రెడీగా ఉన్నామని తేల్చిచెబుతోంది. మాతో మంచిగ ఉంటే దోస్తీ చేస్తాం.. లేదంటే దేనికైనా రెడీ అంటూ కుండబద్దలు కొడుతోంది భారత్. సరిహద్దు దేశాలతో శాంతిపూర్వక వాతావరణాన్ని మెయింటెన్ చేస్తూనే.. కవ్వింపులకు దిగితే మాత్రం తాము వెనకాడబోమని తేల్చి చెబుతోంది. అది చైనా అయినా, పాకిస్థాన్ అయినా..వి డోంట్ కేర్ అంటోంది భారత రక్షణశాఖ. మేము ఎవరిజోలికి వెళ్లం.. మా జోలికి ఎవరైనా వస్తే ఊరుకోమని తొడ కొడుతోంది.

కొన్నేళ్లుగా చైనా సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో.. కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. ఎవరైనా భారత్ జోలికి వస్తే.. అందుకు ధీటుగా బదులిచ్చేందుకు సాయుధ బలగాలు సిద్ధంగా ఉన్నాయని ప్రకటించారు. సవాళ్లు ఏ రూపంలో ఎదురైనా.. వేగంగా, సమర్ధవంతంగా స్పందించేందుకు భారత్ రెడీగా ఉందని స్పష్టం చేశారు.

నింగి, నేల, సముద్రం.. ఏ రూట్లో అయినా.. ఎవరైనా భారతదేశంపై దాడికి దిగితే.. మన బలగాలు చాలా శక్తివంతంగా స్పందిస్తాయని అన్నారు రాజ్ నాథ్. తాము ఎవరి భూమిని కబ్జా చేయలేదని, కానీ ఎవరైనా భారత్‌పై దాడి చేస్తే మాత్రం వాళ్లకు ధీటుగా సమాధానం చెప్పగలిగే స్థితిలో ఉన్నామని తెలిపారు. గత ప్రభుత్వాలు రక్షణ రంగానికి పెద్దపీట వేయలేదని తాను అనడం లేదని, కానీ తాము రక్షణరంగంలో ఆత్మనిర్భర్ భారత్ కింద మరింత బలపేతం చేశామని చెప్పుకొచ్చారు రాజ్ నాథ్.

రక్షణశాఖ బలం, బలగం

రాజ్ నాథ్‌ కామెంట్స్ కేవలం మాటలుగానే తీసుకోలేం. ఆయన వ్యాఖ్యల వెనక భారత రక్షణశాఖ బలం, బలగం కనిపిస్తుంది. ప్రధాని మోదీ అధికారంలో వచ్చినప్పటి నుంచి డిఫెన్స్ రంగంలో ఎన్నో మార్పులు తీసుకొచ్చారు. కొత్త ఆయుధాలు, యుద్ధ సామాగ్రిని సమకూర్చారు. చైనా, అమెరికా లాంటి అగ్రదేశాల దగ్గర ఉన్న ఆయుధ సంపత్తితో పోటీపడి..అడ్వాన్స్ డ్ ఎక్విప్ మెంట్ ను తయారు చేయిస్తున్నారు. కొత్తగా ఫిఫ్త్ జనరేషన్ స్టెల్త్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ లను సమకూర్చుకునేందుకు రెడీ అయింది రక్షణశాఖ. DRDO పెట్టిన 15వేల కోట్ల ప్రతిపాదనకు కేంద్రప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

మరోవైపు అమెరికా నుంచి దిగుమతి చేసుకున్న సీహాక్ మోడల్ హెలికాప్టర్లను రంగంలోకి దించింది భారత నేవీ. సముద్రంలో దాగి ఉన్న శత్రు జలాంతర్గాములు, క్షిపణులను నాశనం చేసి నిఘా పెంచేందుకు ఈ హెలికాప్టర్లు ఉపయోగపడనున్నాయి. ఇప్పటికే ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన నేవీల్లో ఒకటిగా పేరొందిన భారత నౌకాదళం సీహాక్ హెలికాప్టర్ రాకతో మరింత పటిష్ఠంగా మారింది.

మిషాల వ్యవధిలో దాడిచేసే సామర్థ్యం
ఫారిన్ మిలిటరీ సేల్స్ ప్రోగ్రామ్‌లో భాగంగా అమెరికా నుంచి 24 సీహాక్ మోడల్ హెలికాప్టర్లను కొనుగోలు చేసింది భారత్. ఈ హెలికాప్టర్లు శత్రుస్థావరంపై దాడి చేసి సేఫ్ గా బయటకు రాగలవు. సముద్రం కింద దాగి ఉన్న జలాంతర్గాములను, సముద్ర ఉపరితలంపై ఉన్న శత్రుదేశపు నౌకలను గుర్తించి నిమిషాల వ్యవధిలో దాడిచేసే సామర్థ్యం వీటి సొంతం. శత్రు యుద్ధనౌకలపై దాడిచేయడమే కాకుండా రెస్క్యూ ఆపరేషన్, సిబ్బంది రవాణా, వైద్య సామాగ్రి తరలింపు సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.

డిఫెన్స్ లో అత్యాధునిక పరికరాలు సమకూర్చడమే కాకుండా.. బలగాల సంఖ్యను కూడా పెంచింది భారత్. భారీగా ఆర్మీ రిక్రూట్ మెంట్ చేస్తుంది. చైనా, పాక్ సరిహద్దుల్లో బలగాలకు లేటెస్ట్ ఎక్విప్ మెంట్ ను సమకూర్చింది. అందుకే అన్నింటికి సిద్దమంటూ కామెంట్స్ చేశారు రాజ్ నాథ్. శత్రుదేశాల బలాలతో పాటు. మన సత్తాను బేరీజు వేసుకునే ఈ కామెంట్స్ చేశారు రాజ్ నాథ్.

వెడ్ ఇన్ ఇండియా మిషన్‌కు మంచి రెస్పాన్స్.. ఏం జరుగుతుందో తెలుసా?

ట్రెండింగ్ వార్తలు