వెడ్ ఇన్ ఇండియా మిషన్‌కు మంచి రెస్పాన్స్.. ఏం జరుగుతుందో తెలుసా?

Wed in India: ఈ ట్రెండ్‌కి తగ్గట్టుగానే ప్రభుత్వం ఇక్కడ ప్రత్యేక వసతులు కల్పిస్తోంది. రెండేళ్లలో..

వెడ్ ఇన్ ఇండియా మిషన్‌కు మంచి రెస్పాన్స్.. ఏం జరుగుతుందో తెలుసా?

Wed in India

పెండ్లి అంటే లక్షల్లో ఖర్చు. ధనవంతుల ఇండ్లల్లో మ్యారేజ్ అంటే కోట్ల రూపాయలవుతుంది. అపర కుబేరుల వివాహ వేడుకలకు అయితే ఖర్చు లెక్కే ఉండదు. ప్రీ వెడ్డింగ్, ఎంగేజ్ మెంట్ అంటూ వందలు, వేల కోట్లు ఖర్చు పెడుతారు. ఇండియాలోనే మ్యారేజ్ లకు ఇంత ఖర్చు అవుతుందంటే.. విదేశాల్లో పెండ్లీలు చేసుకుంటే ఎంత ఖర్చు కావాలి.

అందుకే కొన్నాళ్లుగా వెడ్ ఇన్ ఇండియా మిషన్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. మనదేశంలోనే వివాహాలు చేసుకోవాలన్న ప్రధాని మోదీ పిలుపునకు దేశంలోని ప్రముఖుల నుంచే కాకుండా.. అన్నివర్గాలు పాజిటివ్ గా స్పందిస్తున్నాయి.

ప్రతి ఏడాది 5వేల మందికి పైగా భారతీయ జంటలు విదేశాలకు వెళ్లి పెళ్లి చేసుకుంటున్నాయి. విదేశాల్లో పెండ్లీలు చేసుకునేవారు పెట్టే ఖర్చు దాదాపు 75వేల కోట్ల నుంచి లక్ష కోట్ల వరకు ఉంటుందని అంచనా. మరో నాలుగైదేళ్లలో ఇది వందశాతానికి పెరిగే అవకాశం ఉంది. ధనవంతులు అంతా డెస్టినేషన్ వెడ్డింగ్స్‌కే ప్రయారిటీ ఇస్తున్నారు.

వాళ్ల వల్ల జ్యువెల్లరీ నుంచి హాస్పిటాలిటీ సెక్టార్ వరకూ అన్ని రంగాల్లోనూ బిజినెస్ పెరిగిపోతుంది. అటువంటి పరిస్థితిలో ఈ డెస్టినేషన్ వెడ్డింగ్‌లు భారతదేశంలోని ప్రముఖ ప్రదేశాలలో నిర్వహిస్తే, ఆ డబ్బు దేశంలోనే ఉంటుంది. కాస్ట్ లీ మ్యారేజీలు జరిగే ఏరియాల్లో ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ఆర్థిక వ్యవస్థ కూడా మెరుగుపడుతుంది.

తంలో మన్ కీ బాత్ ప్రసంగంలోనూ..
ఈ ఉద్దేశంతోనే ప్రధాని మోదీ వెడ్ ఇన్ ఇండియా నినాదం తెరపైకి తెచ్చారు. మేకిన్ ఇండియా లాగే వెడ్ ఇన్ ఇండియా మిషన్ కూడా చాలా ముఖ్యమంటున్నారు ప్రధాని. మోదీ నోట వచ్చిన వెడ్ ఇన్ ఇండియా ఇప్పుడు చర్చనీయాంశమైంది. గతంలో మన్ కీ బాత్ ప్రసంగంలోనూ ఈ వెడ్ ఇన్ ఇండియా ప్రస్తావన తెచ్చారు ప్రధాని. కశ్మీర్ వేదికగా మరోసారి తన నెక్స్ట్ మిషన్ వెడ్ ఇన్ ఇండియా అని స్పష్టం చేశారు మోదీ.

పెళ్లి జీవితంలో ఒక్కసారే జరుగుతుంది. ఆ వేడుకను గ్రాండ్ గా జరుపుకోవాలని ఎవరైనా కోరుకుంటారు. ధనవంతులు అయితే ప్రపంచదేశాల్లోనే వివిధ ప్రాంతాలకు వెళ్లి పెండ్లీలు చేసుకుంటున్నారు. ఫ్రాన్స్, గ్రీస్, ఇటలీ, మాల్దీవులు, బాలీ, జమైకా.. ఇంకా కొత్త కొత్త ఏరియాలు వెడ్డింగ్ కు వేదికలుగా మారుతున్నాయి. అక్కడికి వెళ్లి పెండ్లి చేసుకోవాలంటే.. ఇక్కడ నుంచి వెళ్లే గెస్టులతో పాటు.. అక్కడ పెండ్లి, భోజన ఏర్పాట్లు.. ట్రావెలింగ్ కాస్ట్ భారీ బడ్జెట్ అవుతుంది.

అంతా గ్రాండ్‌గానే
స్పెషల్ ప్రైవేట్ చాపర్స్ బుక్ చేసుకోవడం నుంచి తిరిగి ఇండియాకి వచ్చేంత వరకూ అంతా గ్రాండ్‌గానే ఉండేలా చూసుకుంటున్నారు. అయినా ఖర్చుకు వెనకాడకుండా ప్రతీ ఏడాది వేలాదిమంది విదేశాలకు వెళ్లి మ్యారేజ్ లు చేసుకుంటున్నారు. దాంతో మన దేశంలో ఖర్చు కావాల్సిన ధనం..ఇతర దేశాల అభివృద్ధికి ఉపయోగపడుతుంది.

భారతేతర జంటలు కూడా డెస్టినేషన్ వెడ్డింగ్‌ల కోసం భార‌త్ కు రావడం ప్రారంభిస్తే.. మన ఆర్థికవ్యవస్థ మరింత బలపడుతుందని అంటున్నారు నిపుణులు. ఇక్కడి వ్యాపారులకు మేలు జరుగుతుందని అభిప్రాయ‌ప‌డుతున్నారు. అయితే తమ డెస్టినేషన్ వెడ్డింగ్‌లను దేశంలోనే నిర్వహించేందుకు భారతీయులను ఆకర్షించాలని ప్రభుత్వం భావిస్తే, కొన్ని మార్పులు అవసరమని చెబుతున్నారు. భారతీయ హోటల్‌లు లేదా బాంకెట్ హాల్స్ ఛార్జీలను తగ్గించాల‌ని, వెడ్డింగ్ సీజన్ లో ఈ బాంకెట్ హాల్స్, హోటళ్లు రెట్టింపు వసూలు చేస్తాయ‌ని.. ఈ విష‌యాల్లో మార్పు రావాల‌ని కోరుతున్నారు.

ఇండియాలో పెళ్లి చేసుకోవాలనుకునే వాళ్లలో కొంతమంది ఉదయ్‌పూర్‌ లాంటి ప్రాంతాలను ప్రిఫర్ చేస్తుంటే..మరికొందరు మాత్రం కశ్మీర్‌ని ఎంచుకుంటున్నారు. జమ్ముకశ్మీర్‌లో ప్రత్యేకంగా డెకరేషన్ సెట్టింగులు అక్కర్లేదు. ఎటు చూసినా అందమైన గుట్టలు, లోయలే కనిపిస్తాయి.

ఈ ట్రెండ్‌కి తగ్గట్టుగానే ప్రభుత్వం ఇక్కడ ప్రత్యేక వసతులు కల్పిస్తోంది. రెండేళ్లలో కశ్మీర్ లోయలో దాదాపు 150 డెస్టినేషన్ వెడ్డింగ్స్ జరిగాయి. అంతర్జాతీయ స్థాయిలో ఇక్కడ పెళ్లి చేసుకునేందుకు అన్ని సౌకర్యాలూ అందుబాటులోకి వస్తున్నాయి. శ్రీనగర్‌లోని దాల్ లేక్‌ ఈ డెస్టినేషన్ వెడ్డింగ్స్‌కి కీలకంగా మారింది. ముఖ్యంగా ఇక్కడ ప్రీవెడ్డింగ్ షూట్‌లు ఎక్కువగా జరుగుతున్నాయి.

 

Rupert Murdoch Elena Zhukova : లేటు వయస్సులో ఎలెనా జుకోవాతో రూపెర్ట్ ముర్డోక్ ఎంగేజ్‌మెంట్.. ఇంతకీ జుకోవా ఎవరంటే?