Rupert Murdoch Elena Zhukova : లేటు వయస్సులో ఎలెనా జుకోవాతో రూపెర్ట్ ముర్డోక్ ఎంగేజ్‌మెంట్.. ఇంతకీ జుకోవా ఎవరంటే?
Rupert Murdoch Elena Zhukova : మీడియా టైకూన్ రూపెర్ట్ ముర్డోక్ 92 ఏళ్ల వయస్సులో ఐదోసారి పెళ్లికి రెడీ అవుతున్నారు. తాను డేటింగ్ చేస్తున్న ప్రియురాలు 67 ఏళ్ల ఎలెనా జుకోవాతో ముర్డోక్ ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు.

Media Mogul Rupert Murdoch, 92, Gets Engaged To Elena Zhukova. Who Is She
Rupert Murdoch Elena Zhukova : మీడియా టైకూన్ రూపెర్ట్ ముర్డోక్ 92 ఏళ్ల వయస్సులో ఐదోసారి పెళ్లికి రెడీ అవుతున్నారు. తాను డేటింగ్ చేస్తున్న ప్రియురాలు 67 ఏళ్ల ఎలెనా జుకోవాతో ముర్డోక్ ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. ఆయన సన్నిహితులు ఈ విషయాన్ని ధృవీకరించారు. కాలిఫోర్నియాలోని ఎస్టేట్ మొరాగాలో పెళ్లి వేదికను కూడా ఫిక్స్ చేశారు.
Read Also : Poco M6 5G : ఎయిర్‌టెల్ యూజర్లకు గుడ్ న్యూస్.. రూ. 9వేల లోపు ధరకే పోకో M6 5జీ ఫోన్ సొంతం చేసుకోండి!
అయితే, ఫాక్స్ అండ్ న్యూస్ కార్ప్ చైర్మన్ పదవి నుంచి ఇటీవలే రూపర్ట్ మూర్డోక్ వైదొలిగారు. గత ఏప్రిల్ నుంచి రష్యన్ మాలిక్యులర్ బయాలజిస్ట్‌తో లేటు వయస్సులోనూ డేటింగ్ చేస్తున్నారు. వాస్తవానికి ముర్డోక్‌కు ఇది ఆరో ఎంగేజ్‌మెంట్ కాగా.. కాలిఫోర్నియా వైన్యార్డ్, ఎస్టేట్‌లోని మొరాగాలో వచ్చే జూన్‌లో పెళ్లికి ప్లాన్ చేస్తున్నారు. బీబీసీ ప్రకారం.. రేడియో హోస్ట్ ఆన్ లెస్లీ స్మిత్‌తో ఎంగేజ్‌మెంట్ జరిగిన ఒక ఏడాది లోపు ముర్డోక్ పెళ్లి చేసుకోనున్నారు.
ఎలెనా జుకోవా ఎవరు? :
- ఎలెనా జుకోవా ఒక రిటైర్డ్ మాలిక్యులర్ బయాలజిస్ట్. డయాబెటిస్ రీసెర్చ్‌లో స్పెషలైజేషన్ చేశారు.
- ఇదే రంగంలో జుకోవా ఎంతో కృషి చేశారు. లాస్ ఏంజిల్స్‌లోని కాలిఫోర్నియా యూనివర్శిటీలో కూడా ఈమె సహకారం చాలానే ఉంది.
- మాస్కో నుంచి ఎలెనా జుకోవా 1991లో సోవియట్ యూనియన్ చివరి సంవత్సరాల్లో యునైటెడ్ స్టేట్స్‌కు వెళ్లారు.
- రూపెర్ట్ ముర్డోక్‌ను ఆయన మూడో మాజీ భార్య వెండి డెంగ్ ఏర్పాటు చేసిన ఫ్యామిలీ మీట్‌లో జుకోవా కలిశారు.
- వెండీ డెంగ్, ముర్డోక్ 2013లో విడాకులు తీసుకోగా.. 14 ఏళ్ల పాటు కలిసి ఉన్నారు.
- రూపర్ట్ ముర్డోక్, ఎలెనా గత ఏడాది కాలంగా డేటింగ్ చేస్తున్నారు.
- ఎలెనా జుకోవా గతంలో రెండుసార్లు, రష్యన్ ఆయిల్ బిలియనీర్, అలెగ్జాండర్ జుకోవ్‌ను వివాహం చేసుకున్నారు. వీరికి 42ఏళ్ల దశా జుకోవా అనే ఒక కుమార్తె కూడా ఉంది.
- ఎలెనా జుకోవా కుటుంబ నేపథ్యాన్ని పరిశీలిస్తే.. సాధారణ మాస్కోలోని సాంస్కృతిక అనుబంధాన్ని కలిగి ఉంటుంది.
రూపర్ట్ ముర్డోక్ కెరీర్ :
1950లో ఆస్ట్రేలియాలో కెరీర్‌ను ప్రారంభించిన ముర్డోక్.. 1969లో యూకేలో న్యూస్ ఆఫ్ ది వరల్డ్, ది సన్ న్యూస్ పేపర్లను కొనుగోలు చేశారు. 1996లో ఫాక్స్ న్యూస్‌ని స్థాపించారు. ఆరోగ్య సమస్యల కారణంగా 2013లో స్థాపించిన న్యూస్ కార్ప్‌ను ముర్డోక్ నలుగురు పెద్ద పిల్లలకు అప్పగించారు. వీరికి ఈ కంపెనీలో భారీ వాటాలను ఉండగా.. ఫ్యామిలీ ట్రస్ట్ ద్వారా నడిపిస్తున్నారు.
- రూపర్ట్ ముర్డోచ్ నాల్గో భార్య, సూపర్ మోడల్ జెర్రీ హాల్‌కి 2022లో విడాకులు ఇచ్చాడు.
- అతని మాజీ భార్యలలో వెండి డెంగ్, అన్నా మర్డోచ్ మాన్, ప్యాట్రిసియా బుకర్ ఉన్నారు
- రూపర్ట్ ముర్డోచ్‌కు మొత్తం 6గురు పిల్లలు ఉన్నారు.
- గత సంవత్సరం న్యూస్ కార్ప్‌లో పదవీ విరమణ అనంతరం ముర్డోచ్ తన కుమారుడు లాచ్‌లాన్‌కు పగ్గాలను అప్పగించాడు.
- మర్డోక్ తన 93వ పుట్టినరోజును మార్చి 11న జరుపుకోనున్నారు.