Poco M6 5G : ఎయిర్‌టెల్ యూజర్లకు గుడ్ న్యూస్.. రూ. 9వేల లోపు ధరకే పోకో M6 5జీ ఫోన్ సొంతం చేసుకోండి!

Poco M6 5G : భారత మార్కెట్లో అత్యంత చౌకైన 5జీ స్మార్ట్‌ఫోన్ పోకో ఎం6 5జీ వచ్చేసింది. ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ కస్టమర్‌లు కేవలం రూ. 8,799కే కొనుగోలు చేయొచ్చు.

Poco M6 5G : ఎయిర్‌టెల్ యూజర్లకు గుడ్ న్యూస్.. రూ. 9వేల లోపు ధరకే పోకో M6 5జీ ఫోన్ సొంతం చేసుకోండి!

Poco M6 5G can be bought for under Rs 9k but only if you are an Airtel subscriber

Poco M6 5G : ఎయిర్‌టెల్ యూజర్లకు గుడ్ న్యూస్.. దేశీయ టెలికం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్, స్మార్ట్‌ఫోన్ మేకర్ పోకో భాగస్వామ్యంతో భారత మార్కెట్లో అత్యంత చౌకైన 5జీ స్మార్ట్‌ఫోన్ ప్రవేశపెట్టాయి. అదే.. పోకో M6 5జీ ఫోన్. ఈ ఫోన్‌ను మార్చి 10, 2024 నుంచి రూ. 8,799కు మాత్రమే సొంతం చేసుకోవచ్చు. ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ కనెక్షన్‌ ద్వారా కొనుగోలు చేయొచ్చు. ఈ ఫోన్‌ను కొనుగోలు చేసే ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ కస్టమర్‌లు ఎయిర్‌టెల్ నుంచి 50జీబీ మొబైల్ డేటా బోనస్‌ పొందవచ్చు.

Read Also : Vivo Y100t Launch : భారీ డిస్‌ప్లేతో వివో కొత్త Y100t స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది.. ఫీచర్లు అదుర్స్, ధర ఎంతంటే?

మీరు ఎయిర్‌టెల్ కస్టమర్ కాకపోయినా, ఈ ఆఫర్‌ను పొందాలనుకుంటే.. ఇన్‌స్టంట్ యాక్టివేషన్‌ ద్వారా మీ ఇంటి వద్దకే ఎయిర్‌టెల్ సిమ్‌ని డెలివరీ చేయవచ్చు. పోకో ఎం6 5జీ ఫోన్ మొత్తం 3 స్టోరేజ్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది. 4జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.9,499, 6జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.10,499, 8జీబీ+256జీబీ వేరియంట్ ధర రూ.12,499కు కొనుగోలు చేయొచ్చు. ఈ పోకో ఫోన్ బ్లూ, బ్లాక్ అనే 2 కలర్ ఆప్షన్లలో పొందవచ్చు.

పోకో M6 5జీ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6100 ప్లస్ చిప్‌పై రన్ అవుతుంది. వేగవంతమైన 90హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్‌తో 6.74-అంగుళాల భారీ డిస్‌ప్లేను కలిగి ఉంది. వీడియోలను చూడటమే కాదు.. ఈజీగా గేమ్‌లు ఆడుకోవచ్చు. గరిష్టంగా 16జీబీ ర్యామ్ (8జీబీ LPDDR4X + 8జీబీ టర్బో ర్యామ్), 256జీబీ వరకు స్టోరేజీతో వస్తుంది.

పోకో ఎం6 5జీ ఫోన్ 50ఎంపీ ఏఐ డ్యూయల్-కెమెరా సిస్టమ్‌తో పాటు అందమైన ఫొటోలను తీయొచ్చు. 5000ఎంఎహెచ్ బ్యాటరీ, 18డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను అందిస్తుంది. 4జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్‌తో పోకో M6 5జీ ఫోన్ వేరియంట్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ.8799 ప్రత్యేక ధరకు అందుబాటులో ఉంటుంది.

ఎయిర్‌టెల్‌‌తో భాగస్వామ్యం గురించి పోకో ఇండియా కంట్రీ హెడ్ హిమాన్షు టాండన్ మాట్లాడుతూ.. అత్యంత సరసమైన పోకో M6 5జీ కోసం మరోసారి ఎయిర్‌టెల్‌తో భాగస్వామిగా మారినందుకు సంతోషంగా ఉందన్నారు. పోకో C51 ఫోన్ మాదిరిగానే దేశవ్యాప్తంగా మరింత మంది కస్టమర్‌లకు, ముఖ్యంగా యువతకు పోకో అత్యుత్తమ సాంకేతికతను అందించడంలో ఈ భాగస్వామ్యం సాయపడుతుందని విశ్వసిస్తున్నామని పేర్కొన్నారు.

Read Also : Vivo V30 Pro Series : కొత్త ఫోన్ కొంటున్నారా? అద్భుతమైన కెమెరాలతో వివో V30 సిరీస్ వచ్చేసింది.. ధర ఎంతో తెలుసా?