Vivo Y100t Launch : భారీ డిస్‌ప్లేతో వివో కొత్త Y100t స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది.. ఫీచర్లు అదుర్స్, ధర ఎంతంటే?

Vivo Y100t Launch : వివో కొత్త వై-సిరీస్ స్మార్ట్‌ఫోన్ ప్రవేశపెట్టింది. భారీ డిస్‌ప్లేతో మీడియాటెక్ డైమెన్షిటీ చిప్‌సెట్ వంటి ఆకర్షణీయమైన ఫీచర్లను కలిగి ఉంది. ఈ ఫోన్ ధర, ఫీచర్ల వివరాలు ఇలా ఉన్నాయి.

Vivo Y100t Launch : భారీ డిస్‌ప్లేతో వివో కొత్త Y100t స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది.. ఫీచర్లు అదుర్స్, ధర ఎంతంటే?

Vivo Y100t With 6.64-Inch LCD Screen, MediaTek Dimensity 8200 Chipset

Vivo Y100t Launch : వివో నుంచి సరికొత్త ఫోన్ వచ్చేసింది. ప్రాథమికంగా చైనా మార్కెట్లో వివో వై100టీ ఫోన్ లాంచ్ అయింది. కంపెనీ లేటెస్ట్ వై-సిరీస్ స్మార్ట్‌ఫోన్ మొత్తం మూడు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. ఆండ్రాయిడ్ 13పై కంపెనీ ఆర్జిన్ఓఎస్ 3 స్కిన్‌తో రన్ అవుతుంది. 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో 6.64-అంగుళాల ఎల్‌సీడీ స్క్రీన్‌ను కలిగి ఉంది. 12జీబీ వరకు ర్యామ్‌తో పాటు మీడియాటెక్ డైమెన్సిటీ 8200 చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది. వివో వై100టీ ఫోన్ 64ఎంపీ ప్రైమరీ కెమెరా, 2ఎంపీ డెప్త్ సెన్సార్‌తో వస్తుంది. 120డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టుతో 5,000ఎంఎహెచ్ బ్యాటరీతో వస్తుంది.

Read Also : Buy Smartphone 2024 : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? వచ్చే జూన్‌‌లోగా కొనేసుకోండి.. ఎందుకో తెలుసా?

వివో వై100టీ ధర ఎంతంటే? :
వివో వై100టీ బేస్ మోడల్ 8జీబీ+256జీబీ ర్యామ్ స్టోరేజ్ కాన్ఫిగరేషన్ కోసం సీఎన్‌వై 1,449 (దాదాపు రూ. 17,560) నుంచి ప్రారంభమవుతుంది. ఈ హ్యాండ్‌సెట్‌ను వరుసగా సీఎన్‌వై 1,649 (దాదాపు రూ. 19,310), సీఎన్‌వై 1,849 (ధర దాదాపు రూ. 21,660), 12జీబీ +256జీబీ, 12జీబీ+512బీబీ వేరియంట్‌లలో కొనుగోలు చేయవచ్చు. ఈ హ్యాండ్‌సెట్ చైనాలో ఫిబ్రవరి 28 నుంచి కంపెనీ ఆన్‌లైన్ స్టోర్ ద్వారా విక్రయించనుంది. ఈ వివో కొత్త ఫోన్ ఫార్ మౌంటైన్ గ్రీన్, మూన్ షాడో బ్లాక్, స్నోవీ వైట్ కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంది.

వివో Y100t స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
వివో వై100టీ డ్యూయల్ సిమ్ (నానో) ఆండ్రాయిడ్ 13-ఆధారిత (OriginOS 3)పై రన్ అవుతుంది. 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో 6.64-అంగుళాల ఫుల్-హెచ్‌డీ +(1,080×2,388 పిక్సెల్‌లు) ఎల్‌సీడీ స్క్రీన్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ మీడియాటెక్ నుంచి 4ఎన్ఎమ్ డైమెన్సిటీ 8200 చిప్‌సెట్‌తో ఆధారితమైనది. 12జీబీ వరకు ఎల్‌పీడీడీఆర్5 ర్యామ్ కలిగి ఉంది. బ్యాక్ ప్యానెల్‌లో వివో వై100టీ మోడల్ 64ఎంపీ ప్రైమరీ కెమెరాతో కూడిన ఓఐఎస్, ఎఫ్/1.79 ఎపర్చరు, ఎఫ్/2.4 ఎపర్చర్‌తో వస్తుంది. 2ఎంపీ సెన్సార్‌తో కూడిన డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాను కలిగి ఉంది.

వివో ఈ స్మార్ట్‌ఫోన్‌ను 512జీబీ వరకు యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్‌తో అమర్చింది. కనెక్టివిటీ ఆప్షన్లలో 5జీ, 4జీ ఎల్‌టీఈ, వై-ఫై 6, బ్లూటూత్ 5.3, ఎన్ఎఫ్‌సీ, జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సి పోర్ట్ ఉన్నాయి. 3.5ఎమ్ఎమ్ హెడ్‌ఫోన్ జాక్‌ను కూడా కలిగి ఉంది. వివో వై100టీ బయోమెట్రిక్ అథెంటికేషన్ కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను కలిగి ఉంది. 120డబ్ల్యూ సూపర్‌వూక్ ఛార్జింగ్, 65డబ్ల్యూ యూఎస్‌బీ-పీడీ ఛార్జింగ్‌కు సపోర్టుతో 5,000ఎంఎహెచ్ బ్యాటరీని ప్యాక్ చేస్తుంది. 8.79ఎమ్ఎమ్ మందం, 200గ్రాముల బరువు కలిగి ఉందని కంపెనీ తెలిపింది.

Read Also : Google Pay Soundpad : పేటీఎం, ఫోన్‌పేకు పోటీగా గూగుల్ పే సౌండ్‌ప్యాడ్ వస్తోంది.. ఫీచర్లు, ధర ఎంత ఉండొచ్చుంటే?