5 Most Affordable SUVs : హ్యుందాయ్ ఎక్స్‌టర్ నుంచి టాటా నెక్సాన్ వరకు.. 6 ఎయిర్‌బ్యాగ్‌లతో అత్యంత సరసమైన 5 ఎస్‌యూవీ కార్లు

5 Most Affordable SUVs : కొత్త కారు కొంటున్నారా? 6 ఎయిర్‌బ్యాగ్స్, సేఫ్టీ ఫీచర్లతో కూడిన అత్యంత సరసమైన 5 ఎస్‌యూవీ కార్లను ఓసారి లుక్కేయండి.

5 Most Affordable SUVs : హ్యుందాయ్ ఎక్స్‌టర్ నుంచి టాటా నెక్సాన్ వరకు.. 6 ఎయిర్‌బ్యాగ్‌లతో అత్యంత సరసమైన 5 ఎస్‌యూవీ కార్లు

5 most affordable SUVs with 6 airbags

5 Most Affordable SUVs : కొత్త కారు కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? కారును కొనుగోలు చేసే సమయంలో వినియోగదారులు ఎక్కువగా కారు ఫీచర్లు, కలర్, డిజైన్, మైలేజీ వంటివి ఎక్కువగా చూస్తుంటారు. అన్నింటితో పాటు కారు సేఫ్టీ ఫీచర్లు కూడా అత్యవసరమని తప్పక గుర్తించుకోవాలి. చాలామంది కారు కొనుగోలుదారుల్లో భద్రతపరంగా ఆందోళన కనిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కఠినమైన నిబంధనలతో ఒరిజినల్ డివైజ్ తయారీదారులు (OEM) ఇప్పుడు తమ కార్లలో మెరుగైన భద్రతా ఫీచర్లను అందిస్తున్నారు.

Read Also : Vivo V30 Pro Series : కొత్త ఫోన్ కొంటున్నారా? అద్భుతమైన కెమెరాలతో వివో V30 సిరీస్ వచ్చేసింది.. ధర ఎంతో తెలుసా?

వివిధ భద్రతా ఫీచర్లలో ఎయిర్‌బ్యాగ్‌లు ఇటీవలి కాలంలో చాలా ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. అయితే, కేవలం ఎయిర్‌బ్యాగ్‌లతో మాత్రమే కారు సురక్షితంగా ఉంటుందని అర్థం కాదు. కారు మొత్తం భద్రతను నిర్ణయించడానికి అనేక మరిన్ని ఫీచర్లు ఉండాలి. భారత మార్కెట్లో రోజురోజుకీ ఎస్‌యూవీలకు పాపులారిటీ పెరుగుతున్న నేపథ్యంలో 6 ఎయిర్‌బ్యాగ్‌లతో దేశంలో అత్యంత సరసమైన ఐదు ఎస్‌యూవీలు ఏయే మోడల్స్ ఉన్నాయో వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

హ్యుందాయ్ ఎక్స్‌టర్ :
భారత మార్కెట్లో ప్రతి హ్యుందాయ్ కారు స్టాండర్డ్‌గా 6 ఎయిర్‌బ్యాగ్‌లతో వస్తుంది. హ్యుందాయ్ అందించే అత్యంత సరసమైన ఎస్‌యూవీ ఎక్స్‌టర్. ఈ మైక్రో ఎస్‌యూవీ ఎంట్రీ-లెవల్ వేరియంట్ నుంచి 6 ఎయిర్‌బ్యాగ్‌లను పొందవచ్చు. ఇండియన్ కార్ ఆఫ్ ది ఇయర్ 2024 (ICOTY 2024) అవార్డు విజేత ధర రూ. 6.13 లక్షల నుంచి రూ. 10.28 లక్షలు (ఎక్స్-షోరూమ్) అందిస్తుంది.

హ్యుందాయ్ వెన్యూ :
హ్యుందాయ్ ప్రతి మోడల్ 6 ఎయిర్‌బ్యాగ్‌లతో ప్రామాణికంగా అందిస్తోంది. ఈ హ్యుందాయ్ వెన్యూ మినహాయింపు కాదు. మీరు ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీ బేస్ మోడల్‌ను కొనుగోలు చేసినప్పటికీ, ఎయిర్‌బ్యాగ్‌లను పొందవచ్చు. హ్యుందాయ్ వెన్యూ ధర రూ. 7.94 లక్షలతో మొదలై రూ. 13.44 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది.

కియా సోనెట్ :
కియా కూడా అన్ని మోడల్‌లలో 6 ఎయిర్‌బ్యాగ్‌లను స్టాండర్డ్‌గా అందిస్తోంది. ఇటీవల లాంచ్ అయిన సోనెట్ 2024 బేస్ వేరియంట్‌లో కూడా 6 ఎయిర్‌బ్యాగ్‌లను అందిస్తోంది. ఈ కారు ధర రూ.7.99 లక్షల నుంచి రూ. 15.69 లక్షలు (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంటుంది.

టాటా నెక్సాన్ :
భారత మార్కెట్లో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎస్‌యూవీ నెక్సాన్ కూడా 6 ఎయిర్‌బ్యాగ్‌లను కలిగి ఉంది. గత మోడల్‌లో బేస్ వేరియంట్‌లో 2 ఎయిర్‌బ్యాగ్‌లు మాత్రమే ఉండగా, సెప్టెంబర్ 2023లో లాంచ్ అయిన ఫేస్‌లిఫ్ట్ అన్ని వేరియంట్‌లలో 6 ఎయిర్‌బ్యాగ్‌లను కలిగి ఉంది. నెక్సాన్ మోడల్ ధర రూ. 8.15 లక్షల నుంచి రూ. 15.80 లక్షల (ఎక్స్-షోరూమ్) పరిధిలో ఉంది.

మారుతీ సుజుకి ఫ్రాంక్స్ :
మారుతీ సుజుకి ఫ్రాంక్స్‌లో 6 ఎయిర్‌బ్యాగ్‌లు స్టాండర్డ్‌గా లేవు. మొదటి రెండు వేరియంట్‌లలో జీటా, ఆల్ఫా మోడల్ కార్లు మాత్రమే 6 ఎయిర్‌బ్యాగ్‌లను కలిగి ఉన్నాయి. మీ ఫ్రాంక్స్‌లో 6 ఎయిర్‌బ్యాగ్‌లు కావాలంటే.. కనీసం రూ. 10.55 లక్షలు (జీటా ఎంటీ మోడల్ కారు) ఖర్చు చేయాల్సి ఉంటుంది.

Read Also : Poco M6 5G : ఎయిర్‌టెల్ యూజర్లకు గుడ్ న్యూస్.. రూ. 9వేల లోపు ధరకే పోకో M6 5జీ ఫోన్ సొంతం చేసుకోండి!