Gold Loan : గోల్డ్ లోన్ తీసుకునేవారికి గుడ్ న్యూస్

ప్రముఖ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ గోల్డ్ లోన్ తీసుకునేవారికి శుభవార్త అందించింది.

IIFL Finance Gold loan : ప్రముఖ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ గోల్డ్ లోన్ తీసుకునేవారికి శుభవార్త అందించింది. తక్కువ వడ్డీ రేటుకు గోల్డ్ లోన్ అందిస్తుంది. ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ తాజాగా ఆకర్షణీయమైన గోల్డ్ లోన్ స్కీమ్‌ను తీసుకొచ్చింది. ఈ స్కీమ్ లో వడ్డీ రేటు నెలకు 0.79 శాతం నుంచి ప్రారంభమవుతుంది.

దేశ వ్యాప్తంగా ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ బ్రాంచులు అన్నింటిలోనూ ఈ స్కీమ్ అందుబాటులో ఉన్నట్లు తెలిపింది. తీసుకున్న లోన్ మొత్తాన్ని 24 నెలల్లోగా చెల్లించవచ్చని వెల్లడించింది. నెల, ద్వైమాసిక, త్రైమాసిక, అర్ధ వార్షికానికి ఒక సారి గోల్డ్ లోన్ వడ్డీ మొత్తాన్ని చెల్లించే అవకాశం కల్పించింది.

ఐఐఎఫ్ఎల్ గోల్డ్ లోన్ కోసం కస్టమర్లు బంగారం/ఆభరణాలతో ఐఐఎఫ్ ఎల్ ఫైనాన్స్ బ్రాంచీని సందర్శించవచ్చు. కేవలం 30 నిమిషాల వ్యవధిలోనే రుణాన్ని పొందవచ్చని తెలిపింది. ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ వడ్డీ తిరిగి చెల్లింపుల కొరకు 5-7 రోజుల గ్రేస్ పీరియడ్ అందిస్తుంది. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సంస్థ డిజిగోల్డ్ లోన్ ఫెసిలిటీని కూడా లాంఛ్ చేసింది.

కరోనా సమయంలో రైతులు, చిన్న వ్యవస్థాపకుల మూలధన అవసరాలను తీర్చడానికి బంగారు రుణాలను తక్కువ వడ్డీ రేటుతో ఎక్కువ కాలానికి అందిస్తున్నామని బిజినెస్ హెడ్ – గోల్డ్ లోన్స్, ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ శ్రీ సౌరభ్ కుమార్ అన్నారు. తమ కస్టమర్లలో 70 శాతం మంది మళ్లీ వ్యాపారం కోసం తమ వద్దకు వస్తున్నారని పేర్కొన్నారు. ఇది తమ నిజాయితీ, పారదర్శకతకు నిదర్శనమని అన్నారు.

ట్రెండింగ్ వార్తలు