Supreme Court : అక్రమ లేఔట్ల క్రమబద్దీకరణపై సుప్రీంకోర్టులో విచారణ, కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశం

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలలో అక్రమ లేఔట్ల క్రమబద్దీకరణపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. కౌంటర్ దాఖలు చేయకపోవడంపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది.

Supreme Court : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలలో అక్రమ లేఔట్ల క్రమబద్దీకరణపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ లావు నాగేశ్వరరావు నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. తెలంగాణకు చెందిన జువ్వాడి సాగర్ రావు అక్రమ లేఔట్ల క్రమబద్దీకరణపై పిటిషన్ వేశారు. అక్రమ లేఔట్లపై కేంద్రం, అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు కౌంటర్ దాఖలు చేయాలంటూ కోర్టు తీర్పు ఇచ్చింది.

Jio Users : జియో యూజర్లు రీచార్జీ తేదీ మరిచిపోయారా? నో ప్రాబ్లమ్

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలు కౌంటర్ దాఖలు చేయకపోవడంపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. కాగా, కౌంటర్ దాఖలు చేసేందుకు కొంత సమయం కావాలని తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల న్యాయవాదులు కోర్టుని కోరారు. తెలంగాణ రాష్ట్రం నుంచి న్యాయవాదులు హాజరు కాలేదు. వారి అభ్యర్థనను పరిగణలోకి తీసుకున్న సుప్రీంకోర్టు కౌంటర్ వేయడానికి సమయం ఇచ్చింది.

Weight Loss : బరువు తగ్గటంలో వ్యాయామాలకు తోడుగా..

ఈ కేసులో తదుపరి విచారణను మార్చి రెండో వారానికి వాయిదా వేసింది అత్యున్నత న్యాయస్థానం. కాగా, కేంద్ర ప్రభుత్వం కూడా కౌంటర్ దాఖలు చేయలేదని పిటిషనర్ తరపు న్యాయవాది శ్రవణ్ కుమార్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కేంద్రం కూడా వచ్చే విచారణ వరకు కౌంటర్ దాఖలు చేయాలన్న సుప్రీంకోర్టు ఆదేశించింది.

ట్రెండింగ్ వార్తలు