Weight Loss : బరువు తగ్గటంలో వ్యాయామాలకు తోడుగా….

తక్కువ కొవ్వు పదార్ధాలు అందుబాటులో ఉన్నప్పటికీ, అవి సాధారణ ఆహారాల కంటే ఎక్కువ చక్కెరను కలిగి ఉంటాయి. తక్కువ వ్యవధిలోనే తిరిగి ఆకలి కలిగేలా చేస్తాయి.

Weight Loss : బరువు తగ్గటంలో వ్యాయామాలకు తోడుగా….

Weight Loss

Weight Loss : మారిన జీవనశైలి, ఆహారంలో మార్పుల కారణంగా చాలా మంది అధిక బరువుతో బాధపడుతున్నారు. బరువు తగ్గాలని ఉన్నా తీసుకునే ఆహారం విషయంలో అవగాహన లేకపోవటం, వ్యాయామాలు చేస్తూ బరువు తగ్గే ప్రయత్నం చేస్తుండటం వల్ల ఏమాత్రం తాము అనుకున్న ఫలితాన్ని పొందలేక మదనపడుతున్నారు. ఇలాంటి వారు తప్పనిసరిగా కొన్ని విషయాలను తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.

బరువు తగ్గించే క్రమంలో బాగంగా చాలా మంది ఒత్తిడిని పెంచేలా వ్యాయామాలు చేస్తుంటారు. ఇలా చేయటం ఏమాత్రం శ్రేయస్కరం కాదు. దీని వల్ల శరీరంలో శక్తిని కోల్పోవాల్సి వస్తుంది. శరీరంలోని అదనపు కేలరీలను కరిగించే ప్రయత్నంలో వ్యాయామాల ద్వారా శరీరాన్ని అధికమైన అలసటకు గురిచేయటం వల్ల చివరకు గుండెపోటుకు దారితీసే అవకాశం ఉంటుంది.

అదే క్రమంలో మరికొందరు వ్యాయామాలు చేయకుండా శరీరానికి అందించే కేలరీలను తగ్గించటం ద్వారా బరువు తగ్గేందుకు ప్రయత్నిస్తుంటారు. ఇలా చేయటం వల్ల జీవక్రియ రేటు తగ్గిపోతుంది. అలాగే కండరాల ధృఢత్వాన్ని కోల్పోవాల్సి వస్తుంది. తగినంత మోతాదులో వ్యాయామం చేయటం ద్వారా జీవక్రియ రేటు పెరగటానికి అవకాశం ఉంటుంది. తద్వారా మాత్రమే బరువు తగ్గించుకునే ప్రయత్నం చేయాలి.

తక్కువ కొవ్వు పదార్ధాలు అందుబాటులో ఉన్నప్పటికీ, అవి సాధారణ ఆహారాల కంటే ఎక్కువ చక్కెరను కలిగి ఉంటాయి. తక్కువ వ్యవధిలోనే తిరిగి ఆకలి కలిగేలా చేస్తాయి. వీటికి బదులుగా తక్కువ ప్రాసెస్ చేసిన, అధిక పోషకాలు కలిగిన ఆహారాలను తినటం మంచిది. ఇవి శరీరానికి కావాల్సిన పోషకాలను అందిస్తాయి. ముందుగా మన శరీరంలోని కేలరీల సంఖ్యను అంచనా వేసుకోవటం ద్వారా వాటిని క్రమపద్దతిలో తగ్గించుకునేలా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. మనం అధిక కేలరీలు ఉన్న ఆహారం తీసుకున్నప్పటికీ మితంగా మాత్రమే తినాలి. మరీ తక్కువ కేలరీలను తీసుకోవటం వల్ల కండరాల క్షీణతకు దారి తీసి బరువు తగ్గించే ప్రక్రియ మొత్తం నెమ్మదించటానికి కారణమౌతుంది.

బరువు తగ్గడంలో ప్రోటీన్ కీలక పాత్ర పోషిస్తుంది. ప్రోటీన్ సరైన మొత్తంలో తీసుకోకపోతే, అది జీవక్రియ ప్రక్రియలకు అంతరాయం కలిగిస్తుంది. తిరిగి బరువు పెరగడానికి దారితీస్తుంది. సరైన మోతాదులో ప్రొటీన్ ఆహారం తీసుకోవటం మంచిది. ఫైబర్ ఆకలిని తగ్గించటం సహాకారిగా పనిచేస్తుంది. జీర్ణక్రియకు తోడ్పతుంది. ఫైబర్ వల్ల కడుపు నిండిన భావన కలిగి అధికఆహారం తీసుకోలేము. తద్వారా బరువు సునాయాసంగా తగ్గేందుకు అవకాశం ఉంటుంది.