వెస్ట్ బెంగాల్ లో తాను జైశ్రీరామ్ నినాదాలు చేస్తున్నానని, దమ్ముంటే తనను అరెస్ట్ చేయాలని సీఎం మమతా బెనర్జీకి సవాల్ విసిరారు బీజేపీ చీఫ్ అమిత్ షా.
వెస్ట్ బెంగాల్ లో తాను జైశ్రీరామ్ నినాదాలు చేస్తున్నానని, దమ్ముంటే తనను అరెస్ట్ చేయాలని సీఎం మమతా బెనర్జీకి సవాల్ విసిరారు బీజేపీ చీఫ్ అమిత్ షా. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం (మే-13,2019) వెస్ట్ బెంగాల్ లోని దక్షిణ 24 పర్గణాస్ జిల్లాలోని జాయ్ నగర్ లో నిర్వహించిన ర్యాలీలో అమిత్ షా మాట్లాడుతూ… నేను ఇక్కడ జైశ్రీరామ్ నినాదాలు చేస్తున్నాను. ఇక్కడి నుంచి కోల్ కతాకి వెళ్తాను. మీకు దమ్ము ఉంటే అరెస్ట్ చెయ్యండి మమతాజీ. ఈ రోజు నేను బెంగాల్ లో మూడు ప్లేస్ లలో పర్యటించాల్సి ఉంది.
అయితే ఆ మూడు ప్లేస్ లలోని ఓ చోట నుంచి మమతా బెనర్జీ మేనల్లుడు ఎంపీగా పోటీ చేస్తున్నాడు. నేను అక్కడి వెళ్లి ప్రచారం చేస్తే ఖచ్చితంగా తన అల్లుడు ఓడిపోతాడని మమత గ్రహించింది. అందుకే బీజేపీ ర్యాలీకి అనుమతిని ఆమె రద్దు చేసిందని అమిత్ షా అన్నారు. మే-23,2019న మమతకి బెంగాల్ ప్రజలు తగిన సమాధానం చెబుతారని షా అన్నారు. జాదవ్ పూర్ లో అమిత్ షా ర్యాలీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. అంతేకాకుండా ఆదివారం రాత్రి అమిత్ షా హెలికాఫ్ట్రర్ ల్యాండింగ్ క్లియరెన్స్ ను కూడా ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే.
బెంగాల్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈసీ చర్యలు తీసుకోవాలని కేంద్రమంత్రి ప్రకాష్ జావదేకర్ అన్నారు. ముఖ్యనేతలు ర్యాలీల్లో పాల్గొనకుండా చేస్తే ఎన్నికల అర్థం ఏంటని జావదేకర్ ప్రశ్నించారు. బీజేపీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని తృణముల్ కాంగ్రెస్ కు భయం పట్టుకుందని, దీని కారణంగానే బెంగాల్ సర్కార్ అమిత్ షా, ఇతర బీజేపీ నాయకుల ర్యాలీలకు పర్మిషన్ నిరాకరిస్తుందని ఆయన అన్నారు. వెస్ట్ బెంగాల్ లో మొత్తం 42 లోక్ సభ స్థానాలుండగా ఇప్పటివరకు 33స్థానాలుకు పోలింగ్ ముగిసింది. మే-19,2019న ఏడో దశలో భాగంగా మిగిలిన 9స్థానాలకు పోలింగ్ జరగనుంది. మే-23,2019న ఫలితాలు వెలువడనున్నాయి.
#WATCH BJP President Amit Shah in Joynagar, West Bengal: Mamata didi, I am chanting Jai Shri Ram here & leaving for Kolkata, arrest me if you have guts. pic.twitter.com/gw7yg8bHHU
— ANI (@ANI) May 13, 2019