అబద్దాలు చెప్పటానికి నేను మోడీని కాదు

  • Publish Date - April 17, 2019 / 08:50 AM IST

నేను మోదీలా కాదు.. ఆయనలాగా అబద్ధాలు చెప్పడానికి నేను ఇక్కడికి రాలేదని కాంగ్రెస్‌ చీఫ్ రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు.   రాహుల్ గాంధీ వయనాడ్ వ్యాలీలోని తిరునెల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజలు చేసిన అనంతరం ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సంరద్భంగా రాహుల్ మాట్లాడుతూ..వయనాడ్‌ నుంచి తనకు మద్దతు ఇస్తున్న ప్రజలందరికి ధన్యవాదాలు తెలిపారు.ఇక్కడి ప్రజలతో జీవితాంతం మంచి సంబంధాలను నెలకొల్పుకునేందుకు ఇక్కడికి వచ్చానని తెలిపారు. ఒక కొడుకుగా..సోదరుడిగా ప్రజలు నన్ను భావించాలని రాహుల్ కోరారు.
 

ప్రధాని నరేంద్రమోడీలా  2 లక్షల ఉద్యోగాలు ఇస్తాననీ..ప్రతి ఒక్కరి అకౌంట్‌లో రూ. 15 లక్షలు జమ చేస్తానని తాను మోదీలా అబద్ధాలు చెప్పను అని రాహుల్‌ స్పష్టం చేశారు. దేశ ప్రజలకు ఎన్నో వాగ్ధానాలు చేసిన మోడీ దేశానికి చేసిందేమీ లేదని విమర్శించారు.