Ramdev Baba: రామ్‌దేవ్ తప్పుడు ప్రచారాన్ని ఆపించమని ప్రధానికి ఐఎంఏ వినతి

యోగా గురు రామ్‌దేవ్ తో విసిగిపోయిన ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రధాని నరేంద్ర మోడీకి రిక్వెస్ట్ పంపింది. దయచేసి వ్యాక్సినేషన్ పై రామ్‌దేవ్ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఆపించాలంటూ పేర్కొంది.

Ramadev Baba

Ramdev Baba: యోగా గురు రామ్‌దేవ్ తో విసిగిపోయిన ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రధాని నరేంద్ర మోడీకి రిక్వెస్ట్ పంపింది. దయచేసి వ్యాక్సినేషన్ పై రామ్‌దేవ్ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఆపించాలంటూ పేర్కొంది. దీనిపై తగిన యాక్షన్ తీసుకుని అడ్డుకోవాలంటూ కోరుతుంది.

పీఎం మోడీని అడ్రస్ చేస్తూ రాసిన లెటర్‍‌లో.. ఈ విషయాన్ని బాధతో మీ దగ్గరకు తీసుకురావాల్సి వస్తుందని పేర్కొంది. ‘ఆ వీడియోలో 10వేల మంది డాక్టర్లు కొవిడ్ వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న తర్వాత కూడా చనిపోయారు. లక్షల మంది అల్లోపతి మందులు వాడి ప్రాణాలు కోల్పోతున్నారు’ అని చెప్తున్నట్లుగా ఉంది.

ఈ ఆరోపణలన్నీ రామ్ దేవ్ చేసినట్లుగా ఉండటంతో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇండియన్ మెడికల్ అసోసియేషన్‌కు రామ్‌దేవ్ బాబా 25 ప్రశ్నలు సంధించారు. అల్లోపతికి కేవలం 2 వందల ఏళ్ల చరిత్ర మాత్రమే ఉందని.. ఆయుర్వేదానికి శతాబ్దాల చరిత్ర ఉందని గుర్తు చేస్తూ 25ప్రశ్నలు సంధించారు.