Woman
Viral Video: ఏమరపాటు ఎంతటి ప్రమాదాన్ని తెస్తుందో తెలిపే ఘటన ఇది. పారిశుధ్య కార్మికుల నిర్లక్ష్యం అనాలో లేక ప్రజల అభద్రత అనాలో తెలియదుగాని..ఓ మహిళ..ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్లి తెరిచి ఉన్న మ్యాన్ హోల్ లో పడింది. ఫోన్ చేతిలో ఉండగా చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మరిచిపోయి ఆ మహిళ..ప్రమాద భారిన పడింది. ఏప్రిల్ 21న చోటుచేసుకున్న ఈ ఘటన తాలూకు దృశ్యాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. బీహార్ రాజధాని పాట్నా నగరంలో చోటుచేసుకున్నట్లుగా చెబుతున్న ఈ ఘటన తాలూకు వివరాలు ఇలా ఉన్నాయి. పాట్నాలోని ఓ ప్రాంతంలో రోడ్డుపై వాహనాలు నిలిచి ఉన్నాయి. వాహనాల మధ్యలో నుంచి ఓ మహిళ ఫోన్ మాట్లాడుకుంటూ, దిక్కులు చూసుకుంటూ నడుచుకుంటూ వెళ్తుంది. ఇంతలో మహిళ ముందు ఉన్న ఆటో ముందుకు కదలగా..దాని కిందే మ్యాన్ హోల్ తెరుచుకుని ఉంది. నడుచుకుంటూ వెళ్తున్న ఆ మహిళ అది గమనించక మ్యాన్ హోల్లో పడిపోయింది.
Also read:Girl Students Fight: నడిరోడ్డుపై జట్టు పట్టుకుని కొట్టుకున్న విద్యార్థినిలు: విజయవాడలో ఘటన
ఇది గమనించిన స్థానికులు వెంటనే అప్రమత్తం అయి..ఆ మహిళను రక్షించారు. చిన్న గాయాలతో బయటపడ్డ ఆ మహిళ..తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడింది. మహిళ నడుచుకుంటూ వెళ్తూ మ్యాన్ హాల్లో పడిన దృశ్యాలు స్థానికంగా ఏర్పాటు చేసిన సీసీకేమెరాలో రికార్డు కాగా..ఉత్కర్ష్ సింగ్ అనే మీడియా ప్రతినిధి తన ట్విట్టర్ ఖాతాలో ఆ వీడియోను పోస్ట్ చేశారు. వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవగా..అది చూసిన నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. “మ్యాన్ హోల్ మూత తెరిచి ఉంచిన పారిశుధ్య కార్మికులదే తప్పు” అని ఒకరంటే..ప్రపంచాన్ని మైమరచి ఫోన్ లో మాట్లాడుకుంటూ వెళ్లిన మహిళదే తప్పు అంటూ మరికొందరు కామెంట్ చేశారు.
#Woman, talking over phone, accidentally slips into dug hole in Patna, was rescued by locals#shockingvideo #ViralVideos pic.twitter.com/SU2iSG6YW5
— Utkarsh Singh (@utkarshs88) April 22, 2022