Rajya Sabha Polls: రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటేసిన జేడీ ఎమ్మెల్యే

రాజ్యసభ ఎన్నికల్లో గట్టి పోటీ ఎదురైన తరుణంలో కర్ణాటక జేడీ(ఎస్)ఎమ్మెల్యే శ్రీనివాస గౌడ కాంగ్రెస్ కు ఓటేశారు. అంతేకాకుండా ఇది తనకు చాలా ఇష్టమని కామెంట్ కూడా చేశారు,. తాను కాంగ్రెస్ కు ఓటేశానని అది తనకు చాలా ఇష్టమంటూ వివరించారు.

Karnataka

Rajya Sabha Polls: రాజ్యసభ ఎన్నికల్లో గట్టి పోటీ ఎదురైన తరుణంలో కర్ణాటక జేడీ(ఎస్)ఎమ్మెల్యే శ్రీనివాస గౌడ కాంగ్రెస్ కు ఓటేశారు. అంతేకాకుండా ఇది తనకు చాలా ఇష్టమని కామెంట్ కూడా చేశారు,. తాను కాంగ్రెస్ కు ఓటేశానని అది తనకు చాలా ఇష్టమంటూ వివరించారు.

జేడీ (ఎస్) చీఫ్ హెచ్‌డీ కుమారస్వామి.. కాంగ్రెస్ పార్టీకి చెందిన సిద్ధరామయ్య తమ పార్టీ ఎమ్మెల్యేలను గ్రాండ్ ఓల్డ్ పార్టీ అభ్యర్థికి క్రాస్ ఓటు వేయడానికి ప్రేరేపించారని ఆరోపించారు. పార్టీ సీనియర్ నేత సిద్ధరామయ్య బహిరంగ లేఖ రాసి రెండో అభ్యర్థి మన్సూర్ అలీ ఖాన్‌కు అనుకూలంగా తమ “మనస్సాక్షి ఓటు” వేయాలని అభ్యర్థించారని అన్నారు.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw 

సిద్ధరామయ్యను టార్గెట్ చేసిన కుమారస్వామి.. “స్థానిక మీడియా ముందు తాను తన ఎమ్మెల్యేలకు లెటర్ రాయలేదని చెప్పాడు. సోషల్ మీడియాలో కూడా పోస్టు చేసిన లెటర్ ను చేయలేదని ఎలా అంటున్నాడు. అతని ద్వంద వైఖరిని ప్రతిబింబింపచేస్తుంది ఈ కామెంట్” అని వ్యాఖ్యానించారు.

Read Also: రాజ్యసభ ఎన్నికల ఓటింగ్‌ ప్రారంభం