ఓ టీచర్ కర్రతో కొట్టడంతో అది ఎడమ కంటికి తగిలి, ఆ కంటి చూపును కోల్పోయాడు ఓ విద్యార్థి. ఉత్తరప్రదేశ్‌లోని కౌశాంబిలో ఈ ఘటన చోటుచేసుకుంది. బాధిత విద్యార్థి ఆదిత్య కుష్వాహ ఆరో తరగతి చదువుతున్నాడు. ఈ ఘటన గురించి మీడియాకు వివరించి చెప్పాడు.
మైదానంలో ఆడుకుంటున్న కొంతమంది విద్యార్థులను పిలవాలని తన టీచర్ తనకు చెప్పాడని అన్నాడు. దీంతో తాను వాళ్లకి ఫోన్ చేశానని, వాళ్లు రాలేదని, ఇదే విషయాన్ని తాను తన ఉపాధ్యాయుడికి చెప్పానని వివరించారు. దీంతో కోపం వచ్చి కర్ర విసిరాడని అన్నాడు.
అది తన కంటికి తగలడంతో తనను క్లాసులో పడుకోబెట్టారని, ఏవో కంటి చుక్క మందు వేశారని చెప్పాడు. తన క్లాస్‌మేట్స్ వెళ్లి తన తల్లికి ఈ విషయాన్ని చెప్పారని అన్నాడు. తర్వాత ఆ బాలుడికి రెండుసార్లు ఆపరేషన్ చేసినా కన్ను సరికాలేదు. ఆ విద్యార్థి తల్లి న్యాయం కోసం జిల్లా శిశు సంక్షేమ కమిటీని ఆశ్రయించింది.
ఉపాధ్యాయుడు శైలేంద్ర తివారీపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఆ విద్యార్థి తల్లి శ్రీమాటి మాట్లాడుతూ.. తన కుమారుడు నెవారిలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నాడని చెప్పారు. టీచర్ అతనిపై కర్ర విసిరాడని, అది తన కుమారుడి కంటికి తగిలి రక్తస్రావమైందని అన్నారు. తాము పోలీసు స్టేషన్‌కు వెళ్తే మొదట వారు ఫిర్యాదు నమోదు చేయలేదని, విద్యాశాఖ జోక్యం చేసుకున్న తర్వాత ఈ విషయంపై పోలీసులు విచారణ ప్రారంభించారని చెప్పారు.
యోగ నిద్రతో ఈ ప్రయోజనాలు.. అధ్యయనంలో తేల్చి చెప్పిన పరిశోధకులు