యోగ నిద్రతో ఈ ప్రయోజనాలు.. అధ్యయనంలో తేల్చి చెప్పిన పరిశోధకులు

వారి మెదడులను ఫంక్షనల్ మాగ్నెటిక్ రెసొనెన్స్ ఇమేజింగ్ (ఎఫ్‌ఎంఆర్‌ఐ) టెక్నాలజీతో స్కాన్ చేశారు.

యోగ నిద్రతో ఈ ప్రయోజనాలు.. అధ్యయనంలో తేల్చి చెప్పిన పరిశోధకులు

Updated On : September 24, 2024 / 5:18 PM IST

యోగ నిద్ర వల్ల మానసిక, శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుందని తాజాగా శాస్త్రవేత్తలు నిర్ధారించారు. భారతదేశంలో యోగ నిద్రను ఎన్నో శతాబ్దాలుగా మానసిక, శారీరక ఆరోగ్యం కోసం సాధన చేస్తున్నారు. శవాసనంలో పడుకుని శరీర అవయవాలపై దృష్టి పెడుతూ యోగ నిద్ర సాధన చేస్తారు.

యోగ నిద్రతో మెదడులో జరిగే పరిణామాలు, కలిగే ప్రయోజనాలపై ఐఐటీ ఢిల్లీ, ఎయిమ్స్‌ ఢిల్లీ, మహాజన్ ఇమేజింగ్ ఢిల్లీ పరిశోధకులు అధ్యయనం చేశారు. యోగ నిద్ర సాధన చేసిన వారి మెదడులను ఫంక్షనల్ మాగ్నెటిక్ రెసొనెన్స్ ఇమేజింగ్ (ఎఫ్‌ఎంఆర్‌ఐ) టెక్నాలజీతో స్కాన్ చేశారు.

దాని ఫలితాలను అంతర్జాతీయ జర్నల్ సైంటిఫిక్ రిపోర్ట్స్‌లో ప్రచురించారు. యోగ నిద్ర సాధన ఎంతో విశ్రాంతిని ఇస్తుందని పరిశోధకులు తేల్చినట్లు అందులో పేర్కొన్నారు. యోగ/ధ్యానం చేసేవారిలో ‘యోగ నిద్ర’ సాధన మరింత బాగా పనిచేసిందని, మెదడులో జరిగిన సానుకూల మార్పులను గమనించామని శాస్త్రవేత్తలు చెప్పారు.

క్రమం తప్పకుండా ధ్యానం చేసేవారు 30 మంది, ధ్యానం అలవాటు లేని 31 మందిపై ఈ పరిశోధన చేసినట్లు తెలిపారు. ధ్యానం చేసే అలవాటు ఉన్నవారిలో నరాల వ్యవస్థ ప్రతిస్పందనలు ధ్యానం అలవాటు లేని వారికంటే బాగున్నాయని చెప్పారు. దీని ద్వారా యోగ నిద్ర మన మెదడు కార్యకలాపాలను ఎలా ప్రభావితం చేస్తుందో, పూర్తిగా రిలాక్స్ పొందేస్థితికి యోగ నిద్ర ఎలా తీసుకువెళ్తుందో తెలుస్తుందని తెలిపారు.

అయ్యో.. సునీతా విలియమ్స్‌ను అంతరిక్ష కేంద్రం నుంచి తీసుకొచ్చే మిషన్‌కు దీనితో ముప్పు