అయ్యో.. సునీతా విలియమ్స్‌ను అంతరిక్ష కేంద్రం నుంచి తీసుకొచ్చే మిషన్‌కు దీనితో ముప్పు

ఇప్పటికే ఫ్లోరిడాలోని నాసా కెన్నెడీ స్పేస్ సెంటర్‌లో క్రూ-9 మిషన్ సంసిద్ధతపై జరిపిన రివ్యూ విజయవంతంగా ముగిసింది.

అయ్యో.. సునీతా విలియమ్స్‌ను అంతరిక్ష కేంద్రం నుంచి తీసుకొచ్చే మిషన్‌కు దీనితో ముప్పు

Astronauts Sunita Williams and Barry Butch

Updated On : September 24, 2024 / 4:33 PM IST

నాసా, స్పేస్‌ ఎక్స్ కలిసి క్రూ-9 మిషన్‌ను ఈ నెల 26న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి పంపడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాయి. ఈ మిషన్ ద్వారానే సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్‌ను అంతరిక్ష కేంద్రం నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరిలో తిరిగి భూమి మీదకు తీసుకురానున్నారు.

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లి ఆ ఇద్దరు వ్యోమగాములు అక్కడే చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. వారిని అంతరిక్ష కేంద్రానికి తీసుకెళ్లిన బోయింగ్ స్టార్ లైనర్ స్పేస్‌క్రాఫ్ట్‌లో సాంకేతిక లోపాల కారణంగా వారు తిరిగి భూమి మీదకు రాలేకపోయారు.

మళ్లీ సమస్య ఏంటి?
ఇప్పుడు క్రూ-9 ద్వారా వారిని తిరిగి భూమి మీదకు తీసుకువద్దామని శాస్త్రవేత్తలు ప్రణాళికలు వేసుకున్నారు. అయితే, ఆదిలోనే ఆ మిషన్‌కు గల్ఫ్ ఆఫ్ మెక్సికో, ఫ్లోరిడా పశ్చిమ తీరంలో సంభవించనున్న ఉష్ణమండల తుపాను నైన్‌ వల్ల ముప్పు పొంచి ఉంది.

నాసా, స్పేస్‌ ఎక్స్‌, యూఎస్‌ స్పేస్ ఫోర్స్ 45 వెదర్ స్క్వాడ్రన్ కలిసి ఈ తుపాను పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నాయి. ప్రయోగ షెడ్యూల్‌పై తుపాను ప్రభావం చూపే అవకాశం ఉంది. క్రూ-9 ప్రయోగ తేదీ సమీపిస్తుండడంతో అధికారులు వాతావరణ పరిస్థితిని ప్రతి నిమిషం అంచనా వేస్తున్నారు.

కాగా, ఇప్పటికే ఫ్లోరిడాలోని నాసా కెన్నెడీ స్పేస్ సెంటర్‌లో క్రూ-9 మిషన్ సంసిద్ధతపై జరిపిన రివ్యూ విజయవంతంగా ముగిసింది. స్పేస్‌ ఎక్స్ ఇబ్బందితో పాటు రవాణా వ్యవస్థ, అంతరిక్ష కేంద్రం, దాని పార్ట్నర్స్‌ ప్రయోగానికి సిద్ధంగా ఉన్నారని దాని ద్వారా నిర్ధారణ అయింది. వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తాయా అన్న సందిగ్ధతే కొనసాగుతోంది.

ఏంటీ ఈ స్పేస్ ఎక్స్ క్రూ 9?
ఇది నాసా ఆపరేషనల్ కమర్షియల్ క్రూ ప్రోగ్రామ్. స్పేస్‌ ఎక్స్‌ క్రూ-9 ద్వారా నలుగురు వ్యోమగాములను నాసా అంతరిక్ష కేంద్రానికి పంపాల్సి ఉంది. జెనా కార్డ్‌మాన్, నిక్ హేగ్ అనే వ్యోమగాములతో పాటు స్టెఫానీ విల్సన్‌, రోస్కోస్మోస్ వెళ్లాల్సి ఉంది. ఇప్పుడు వారిలో ఇద్దరినే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి పంపుతున్నారు.

రెండు సీట్లను ఖాళీగా ఉంచుతారు. ఆ ఖాళీ సీట్లలోనే కూర్చొని అంతరిక్ష కేంద్రం నుంచి సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ భూమి మీదకు వస్తారు. షెడ్యూల్ ప్రకారం ఈ మిషన్ ఇప్పటికే ప్రారంభం కావాల్సి ఉండగా, బోయింగ్ స్టార్‌లైనర్‌లో సాంకేతిక సమస్యల కారణంగా ఇది వాయిదా పడింది. ఎల్లుండి దీన్ని ప్రయోగించనున్నారు.

మేనేజర్‌కు క్రికెట్‌ పిచ్చి.. అదే ఈ అమ్మాయి ప్రాణం మీదకు తెచ్చిందా? పెరయిల్ తండ్రి ఏమన్నారు?