Income Tax : ఆదాయపు పన్ను పరిమితి రూ.5లక్షలకు పెంపు!

ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని పెంచనున్నారు. ఐటీ మినహాయింపు పరిమితిని ప్రస్తుత రూ.2.5 లక్షల నుంచి వచ్చే 2023-2024 బడ్జెట్ లో రూ.5లక్షలకు పెంచే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

Income tax : ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని పెంచనున్నారు. ఐటీ మినహాయింపు పరిమితిని ప్రస్తుత రూ.2.5 లక్షల నుంచి వచ్చే 2023-2024 బడ్జెట్ లో రూ.5లక్షలకు పెంచే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. పరిమితిని పెంచితే వినియోగదారుల దగ్గర ఖర్చు చేయదగ్గ ఆదాయం మిగులుతుందని ఆ వర్గాలు వెల్లడించాయి.

PAN-Aadhaar: మార్చి 31లోపు ఆధార్ లింక్ చేయకపోతే పాన్ రద్దు.. ఐటీ శాఖ చివరి హెచ్చరిక

వినియోగం పెరిగి ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలిపాయి. ప్రస్తుతం రూ.2.5లక్షల ఆదాయం వరకు ఇన్ కమ్ ట్యాక్స్ లేదు. 60 సంవత్సరాలు పైబడిన సీనియర్ సిటిజన్లకు రూ.3లక్షలు, 80 ఏళ్లు దాటిన సూపర్ సీనియర్ సిటిజన్లకు రూ.5లక్షల ఆదాయం వరకు పన్ను మినహాయింపు ఉంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2023 ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ ను లోక్ సభలో ప్రవేశపెడతారని భావిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు