‘చంద్రబాబుని అడగండి’.. ఎన్డీఏ ప్రభుత్వం పడిపోతుందా అన్న ప్రశ్నకు చిదంబరం కీలక వ్యాఖ్యలు

పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీ ఎన్నికలకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలని..

Chidambaram, Chandrababu Naidu

P Chidambaram: బీజేపపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఆగస్టు నాటికి కుప్పకూలిపోవచ్చని ఆర్‌జేడీ చీఫ్ లాలూ యాదవ్ చేసిన వ్యాఖ్యలు మరవక ముందే కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం కూడా ఇటువంటి వ్యాఖ్యలే చేశారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీ ఎన్నికలకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలని, ఇది చాలా అవసరమని చెప్పారు.

అమెరికా అధ్యక్షుడి పదవిలా ఇది నిర్ణీత సమయం ఉండేది కాదని అన్నారు. పార్లమెంటుకి జవాబుదారీతనంతో వ్యవహరించాలని చెప్పారు. ఏ సమయంలోనైనా ఓడిపోయే అవకాశాలు ఉంటాయని తెలిపారు.

కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఐదేళ్ల పాటు ఉంటుందా? అని అడిగిన ప్రశ్నకు చిదంబరం సమాధానం చెబుతూ.. ఈ ప్రశ్నను ఈ దేశంలోని ఇద్దరు జెంటిల్‌మన్లు చంద్రబాబు నాయుడు, నితీశ్ కుమార్‌ను అడగాలని చెప్పారు. కాగా, ఎన్డీఏ ప్రభుత్వంలో చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ, నితీశ్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ కీలకంగా వ్యవహరించిన విషయం తెలిసిందే.

టీడీపీకి 16, జేడీయూకి 12 లోక్‌సభ సీట్లు ఉన్నాయి. సీఏఏ గురించి చిదంబరం మాట్లాడుతూ.. దాన్ని కాంగ్రెస్, ఇండియా కూటమి వ్యతిరేకిస్తోందని చెప్పారు.

“నితీశ్ కుమార్ సీఏఏను వ్యతిరేకించారో లేదో కానీ, చంద్రబాబు నాయుడు గతంలో దాన్ని వ్యతిరేకించారు. ఆయన తన మాటపైనే ఉంటారని అనుకుంటున్నాను. నేను ఇప్పుడు ఏమీ చెప్పలేను. మేము మాత్రం సీఏఏను వ్యతిరేకిస్తున్నాం’’ అని చిదంబరం అన్నారు.

Also Read: పెళ్లికి హాజరైన స్నేహితులు, ఆత్మీయులకు అనంత్ అంబానీ ఖరీదైన గిఫ్ట్ .. వాటి ధర ఎంతంటే?