Fedex
Raj Subramaniam: ప్రపంచ కార్పొరేట్ వ్యవస్థలో మరో మారు భారత నైపుణ్యనానికి, ప్రతిభకు గుర్తింపు లభించింది. అమెరికాకు చెందిన ప్రముఖ కొరియర్, రవాణా దిగ్గజ సంస్థ ఫెడెక్స్ కంపెనీ సీఈఓగా భారత్ కు చెందిన రాజ్ సుబ్రమణియం నియమించబడ్డారు. దీంతో ప్రపంచ టెక్ దిగ్గజ సంస్థలను నడిపిస్తున్న సత్య నాదెళ్ల, సుందర్ పిచాయ్, పరాగ్ అగర్వాల్ వంటి భారత నిపుణుల సరసన రాజ్ సుబ్రమణియం చేరారు. 1991లో ఫెడెక్స్ సంస్థలో చేరి వివిధ విభాగాల్లో పనిచేస్తూ వచ్చిన సుబ్రమణియం 2020లో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ గా ఎంపికయ్యారు. అంతకముందు ఫెడెక్స్ గ్రూప్ లోని పలు విభాగాల్లో సీఓఓ, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ వంటి అత్యున్నత స్థాయిలో పనిచేసిన సుబ్రమణియం..గత మూడు దశాబ్దాలుగా సంస్థ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు.
Also read:Old man locked in Bank: పాపం పెద్దాయన.. రాత్రంతా బ్యాంకులోనే ఉంచి తాళం వేశారు..!
ప్రపంచంలోనే అతిపెద్ద రవాణా, కొరియర్ సంస్థ అయిన ఫెడెక్స్ కు ప్రస్తుతం ఫ్రెడెరిక్ స్మిత్ సీఈఓగా వ్యవహరిస్తున్నారు. జూన్ 1, 2022 నాటికీ ఫ్రెడెరిక్ ఆపదవి నుంచి దిగిపోనుండగా..ఆ స్థానంలో సరైన వ్యక్తిని నియమించేందుకు గత ఎనిమిది నెలలుగా బోర్డు డైరెక్టర్లు తలలు పట్టుకున్నారు. ఈక్రమంలో సంస్థ అభివృద్ధికి తోడ్పడుతూ, ఫెడెక్స్ కార్యకలాపాలపై పూర్తి అవగాహన కలిగిఉన్న రాజ్ సుబ్రమణియంను సీఈఓగా పేర్కొంటూ స్మిత్ అభిప్రాయాన్ని వెల్లడించారు. దీంతో బోర్డులోని మిగతా సభ్యులు సైతం ఓకే చెప్పడంతో ప్రపంచంలోనే అతిపెద్ద రవాణా సంస్థకు భారత సంతతి వ్యక్తి సీఈఓగా భాద్యతలు చేపట్టనున్నారు.
Also read:PM Modi – PMAY: 5.21 లక్షల మంది పేదలకు ఇళ్ల పంపిణీ ప్రారంభించిన ప్రధాని మోదీ
రాజ్ సుబ్రమణ్యం: విద్య మరియు నేపథ్యం:
రాజ్ సుబ్రమణియం భారత్ లోని కేరళ రాజధాని త్రివేండ్రంలో జన్మించారు. 1987లో IIT బాంబే నుండి కెమికల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ పట్టా అందుకున్నారు. అనంతరం అమెరికా వెళ్లిన రాజ్ సుబ్రమణియం అక్కడి సైరాక్యూస్ యూనివర్సిటీ నుంచి కెమికల్ ఇంజనీరింగ్ లో మాస్టర్స్ డిగ్రీ చేశారు. అనంతరం టెక్సాస్ విశ్వవిద్యాలయం నుంచి మార్కెటింగ్ మరియు ఫైనాన్స్‌లో MBA డిగ్రీ సాధించి 1991లో ఫెడెక్స్ సంస్థలో చేరారు.
Also Read:Telangana Power : విద్యుత్‌కు ఫుల్ డిమాండ్.. అప్పుడే మండుతున్న ఎండలు, ఆదిలాబాద్‌లో 43 డిగ్రీలు!