PM Modi – PMAY: 5.21 లక్షల మంది పేదలకు ఇళ్ల పంపిణీ ప్రారంభించిన ప్రధాని మోదీ

ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన పధకం ద్వారా మధ్యప్రదేశ్ లో నిర్మించిన 5.21 లక్షల గృహహాలను ప్రధాని మోదీ మంగళవారం ప్రారంభించారు

PM Modi – PMAY: 5.21 లక్షల మంది పేదలకు ఇళ్ల పంపిణీ ప్రారంభించిన ప్రధాని మోదీ

Pmay

PM Modi – PMAY: కేంద్రంలోనూ, రాష్ట్రాలలోనూ బీజేపీ పాలనతో పేదలకు సాధికారత కల్పిస్తోందని ప్రధాని మోదీ అన్నారు. ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన పధకం ద్వారా మధ్యప్రదేశ్ లో నిర్మించిన 5.21 లక్షల గృహహాలను ప్రధాని మోదీ మంగళవారం ప్రారంభించారు. “గృహ ప్రవేశ్” పేరుతో మధ్యప్రదేశ్ ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈకార్యక్రమాన్ని ప్రధాని మోదీ వర్చువల్ విధానంలో పాల్గొని ప్రారంభించారు. విడతల వారీగా గృహాలను లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు. ఈసందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ..కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమైనా, రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలైనా.. ‘సబ్కా సాథ్ సబ్‌కా వికాస్’ అనే నినాదంతో ముందుకు వెళ్తున్నట్లు పేర్కొన్నారు. పేదలకు సాధికారత కల్పించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేస్తున్నారని మోదీ వ్యాఖ్యానించారు.

Also read:Telangana Power : విద్యుత్‌‌కు ఫుల్ డిమాండ్.. అప్పుడే మండుతున్న ఎండలు, ఆదిలాబాద్‌‌లో 43 డిగ్రీలు!

కొన్ని రాజకీయ పార్టీలు పేదరికాన్ని నిర్మూలించాలని ఎన్నో ప్రకటనలు చేసినా పేదలకు సాధికారత కల్పించేందుకు తగిన చర్యలు తీసుకోలేదని మోదీ అన్నారు. పేదలు సాధికారత సాధిస్తే పేదరికంతో పోరాడే ధైర్యాన్ని అందిస్తుందని తాను విశ్వసిస్తున్నట్లు మోదీ తెలిపారు. సాధికారత పొందిన పేదవారితో పాటు నిజాయితీ గల ప్రభుత్వ ప్రయత్నాలు కలిసి వచ్చినప్పుడు, పేదరికాన్ని నిర్ములించవచ్చని ప్రధానమంత్రి అన్నారు. ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన పధకం కింద ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా రెండున్నర కోట్ల గృహాలను నిర్మించామన్న మోదీ..వాటిలో రెండు కోట్ల గృహాలు రూరల్ ఏరియాల్లో ఉన్నట్లు పేర్కొన్నారు.

Also read:Union Bank : బ్యాంకు సిబ్బంది నిర్లక్ష్యం.. 18 గంటల పాటు లాకర్ గదిలో 75 ఏళ్ల వృద్ధుడు

PMAYలో భాగంగా నిర్మించిన ఈ గృహాలు ఎంతో ప్రత్యేకమైనవని మోదీ అన్నారు. ఈ గృహాలలో ఉజ్జ్వల యోజన పధకం కింద గ్యాస్ సరఫరా, ఉజాలా యోజన పధకం కింద LED బల్బులు, స్వచ్ఛ భారత్ అభియాన్ పధకం కింద మరుగుదొడ్లు, హర్ ఘర్ జల్ యోజన పధకం కింద కుళాయి కనెక్షన్లు ఇవ్వబడినట్లు మోదీ తెలిపారు. అదే విధంగా దేశ వ్యాప్తంగా నల్ జల్ పధకం కింద ఆరు కోట్ల గృహాలకు రక్షిత మంచినీటి కుళాయి కనెక్షన్ ఇచ్చినట్లు ప్రధాని మోదీ తెలిపారు.

Also read:G.Kishan reddy: తెలంగాణ రాష్ట్రంలో దౌర్భాగ్యమైన రాజకీయాలు నడుస్తున్నాయి: కిషన్ రెడ్డి