G.Kishan reddy: తెలంగాణ రాష్ట్రంలో దౌర్భాగ్యమైన రాజకీయాలు నడుస్తున్నాయి: కిషన్ రెడ్డి
యాదాద్రి ఆలయంలో సోమవారం నాడు జరిగిన మహా సమారోహం కార్యక్రమానికి తనకు ఆహ్వానం అందకపోవడంపై కేంద్ర మంత్రి జీ.కిషన్ రెడ్డి స్పందించారు

Kishan Reddy
G.Kishan reddy: యాదాద్రి ఆలయంలో సోమవారం నాడు జరిగిన మహా సమారోహం కార్యక్రమానికి తనకు ఆహ్వానం అందకపోవడంపై కేంద్ర మంత్రి జీ.కిషన్ రెడ్డి స్పందించారు. మంగళవారం హైదరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ..యాదాద్రి సమారోహానికి ప్రభుత్వ ప్రోటోకాల్ అంటూ ఏమిలేదని..తనను ఆహ్వానించక పోయినా..ఎంతో దివ్యమైన క్షేత్రంగా విరాజిల్లుతున్న ఆలయాన్ని స్వయంగా వ్యక్తిగతంగా త్వరలో సందర్శిస్తానని కిషన్ రెడ్డి అన్నారు. యాదాద్రి సమారోహానికి రాష్ట్ర గవర్నర్ ను ఏంద్దుకు ఆహ్వానించలేదో తనకు తెలియదని ఈ విషయం సీఎం కేసీఆర్ నే అడగాలని కిషన్ రెడ్డి అన్నారు. యదాద్రి పేరు మార్పుపై తనకు అంత అవగాహన లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.
Also read:Maharashtra : 15 ఏళ్లుగా మూసివున్న షాపులో మనిషి చెవులు, మెదడు, కళ్లు, అవశేషాలు..
తెలంగాణ రాష్ట్రంలో దౌర్భాగ్యమైన రాజకీయాలు నడుస్తున్నాయన్న కిషన్ రెడ్డి.. కేంద్రం అనేక పధకాలు, నిధులు ఇచ్చినా.. ఏమి ఇవ్వలేదంటూ సీఎం కేసీఆర్ తొండి ఆటలు ఆడుతున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సాయంత్రం లోపు ఎస్టీ రిజర్వేషన్ల జీవో తీసుకొస్తే.. ఎవరైనా అడ్డుకుంటే నాది భాద్యత అని కిషన్ రెడ్డి అన్నారు. నాగలాండ్ లో ఎస్టీలకు 85 శాతం రిజర్వేషన్లు ఉన్నాయని అక్కడ రెసెర్వేషన్లను బీజేపీ ప్రభుత్వం అడ్డుకుందా? అని కిషన్ రెడ్డి అన్నారు. హుజురాబాద్ ఎన్నికల తరువాతనే తెలంగాణ ప్రభుత్వం ధాన్యం సమస్యని లేవనెత్తిందన్న కిషన్ రెడ్డి..చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేసే బాధ్యత బీజేపీ ప్రభుత్వానిదేనని పునరుథ్ఘటించారు.
Also read:Indrakeeladri : వసంత నవరాత్రోత్సవాలు.. ఒక్కోరోజు ఒక్కోరకం పుష్పాలతో అర్చన
కేంద్రం తరుపున హైదరాబాద్ లో ట్రైబల్ మ్యూజియం, సైన్స్ మ్యూజియం, వరంగల్ కి సైనిక స్కూల్ మంజూరు చేశామని..అయితే తెలంగాణ ప్రభుత్వం కనీసం భూములు కేటాయించలేదని కిషన్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణ నిమిత్తం కేంద్ర ప్రభుత్వం రూ.1250 కోట్లు ఇస్తుండగా..రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అడ్డుకుందో తెలియడం లేదని కిషన్ రెడ్డి అన్నారు. వచ్చిన సంస్థలను సద్వినియోగం చేసుకోకుండా రానివాటి కోసం కేసీఆర్ రాద్దాం చేస్తున్నారని కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ బీజేపీని, ప్రధాని మోదీపై అక్కసు వెళ్లగక్కేందుకు టీఆర్ఎస్ మంత్రులు ఎమ్మెల్యేలకు టైం కోటా ఇచ్చారంటూ కిషన్ రెడ్డి ఘాటు విమర్శలు చేశారు.
Also read:Visakha SP Vs MP: విశాఖలో ఎస్పీ వర్సెస్ ఎంపీ: భూకబ్జా వ్యవహారంపై వివరణ ఇచ్చిన ఇరువురు