Visakha SP Vs MP: విశాఖలో ఎస్పీ వర్సెస్ ఎంపీ: భూకబ్జా వ్యవహారంపై వివరణ ఇచ్చిన ఇరువురు

విశాఖ నగరంలో ఇంటెలిజెన్స్ ఎస్సీ మధుకి చెందిన భూమిని ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కబ్జా చేశారంటూ గత రెండు రోజులుగా మీడియాలో వస్తున్న కథనాలపై నేడు ఇరువురు స్పష్టత ఇచ్చారు.

Visakha SP Vs MP: విశాఖలో ఎస్పీ వర్సెస్ ఎంపీ: భూకబ్జా వ్యవహారంపై వివరణ ఇచ్చిన ఇరువురు

Vizag

Visakha SP Vs MP: విశాఖ నగరంలో ఇంటెలిజెన్స్ ఎస్సీ మధుకి చెందిన భూమిని ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కబ్జా చేశారంటూ గత రెండు రోజులుగా మీడియాలో వస్తున్న కథనాలపై నేడు ఇరువురు స్పష్టత ఇచ్చారు. భూకబ్జా వ్యవహారంలో ఎంపీ పేరును ప్రస్తావించ్చడంలో ఎస్పీ మధు వివరణ ఇవ్వగా..కబ్జాకు తనకు సంబంధంలేదని ఎంపీ ఎంవీవీ స్పష్టం చేశారు. మంగళవారం ఇంటెలిజెన్స్ ఎస్సీ మధు విశాఖలో మీడియాతో మాట్లాడుతూ..తన స్థలాన్ని ఎంపీ ఎంవీవీ కబ్జా చేశారని ఎక్కడా అనలేదని పేర్కొన్నారు. 2016లో నలుగురం మిత్రులం కలిసి 531 గజాల స్థలం కొనుగోలు చేశామని..2018లో జీవీఎంసీ ప్లాన్ అప్రూవల్ కోసమని వెళితే అందులో కేవలం 168 గజాలు మాత్రమే మాకు చెందుతుందని మిగిలిన భూమి ప్రభుత్వానికి చెందినదని రెవెన్యూ అధికారులు చెప్పారని ఎస్పీ మధు వివరించారు.

Also Read:Indrakeeladri : వసంత నవరాత్రోత్సవాలు.. ఒక్కోరోజు ఒక్కోరకం పుష్పాలతో అర్చన

దీంతో తమకు స్థలం అమ్మిన ఎల్లపు వినోద్ పై 2018లో కేసు పెట్టినట్లు ఎస్పీ తెలిపారు. అయితే మిగిలిన 168 గజాల స్థలంలో ఇటీవల తాము గోడ నిర్మించుకున్నామని..అదే సమయంలో ఎంపీ ఎంవీవీకి చెందిన లేఅవుట్ లో డ్రైనేజిపై కల్వర్ట్ కట్టారని దీంతో ఆస్థలం మీదుగా రాకపోకలు సాగిస్తుండడంతో తమకు ఇబ్బందిగా తోచి తమ స్థలంలో గోడ నిర్మాణం చేపట్టినట్లు ఎస్పీ మధు వివరించారు. అయితే గోడ నిర్మాణాన్ని ఆపాలంటూ ఎంపీ ఎంవీవీ అడ్డుకోవడంతో ఎస్పీ మధు పోలీసులను ఆశ్రయించారు. అదే విషయాన్నీ మీడియాలో చెప్పానని.. ఎంపీ మా భూమిని కబ్జా చేసారని నేను ఎక్కడ అనలేదని ఎస్పీ మధు తెలిపారు.

Also read:Jubilee Hils : వీరు మారరా ? పొద్దున్నే తాగేసి.. కారుతో ర్యాష్ డ్రైవింగ్

అధికారుల అనుమతి తీసుకోని గోడ నిర్మాణం చేస్తామని స్పష్టం చేసారు. ఇక ఈ వివాదంపై విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ స్పందిస్తూ..గత రెండు రోజులుగా నాపై భూకబ్జా ఆరోపణలు వచ్చాయని.. అయితే ఈ వ్యవహారంలో తనకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. “ఎస్పీ ఎవరో నాకు తెలియద..భూమి కొనుగోలు వ్యవహారంలో ఎస్పీ గారు మోసపోయారు. నా మనుషులు ఎవరూ ఇక్కడికి రాలేదు” అని ఎంపీ సత్యనారాయణ తెలిపారు. రోడ్డుపైన గోడ కడుతున్నారని వచ్చిన సమాచారం మేరకు వెంటనే పోలీస్ స్టేషన్ కు ఫోన్ చేసి తాత్కాలికంగా గోడ నిర్మాణాన్ని ఆపమని చూపినట్లు ఎంపీ వివరించారు.

Also read:UP : యూపీ పెళ్లి వేడుక‌ల్లో గిఫ్ట్‌లుగా బుల్డోజ‌ర్లు..ఇవి మ‌హిళ‌ల భ‌ద్ర‌త‌కు,యూపీ అభివృద్ధికి గుర్తు అంటున్న మేయర్

ఎల్లపు వినోద్ కుమార్ అనే వ్యక్తి వద్ద 2016లో 500 గజాల స్థలాన్ని ఎస్పీ ఆయన స్నేహితులు కొన్నారు. అయితే వినోద్ కుమార్ కు ఆ లేఅవుట్ కు సంబంధంలేదని..అతను వీరికి ఆ భూమి ఎలా అమ్మారో తెలియాల్సి ఉందని ఎంపీ సత్యనారాయణ పేర్కొన్నారు. 2018లోనే భూమిని అక్రమంగా అమ్మిన ఘటనలో వినోద్ కుమార్ పై పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయినట్లు ఎంపీ తెలిపారు. రైతులు ఇచ్చిన 10 ఎకరాల స్థలంలో పెరిపిరల్ రోడ్డు కోసం వెయ్యి గజాలు పక్కనపెట్టామని..ప్రజలు ఇబ్బంది పడుతున్నారని గమనించి కల్వర్ట్ కట్టినట్లు ఎంపీ పేర్కొన్నారు. తనపై రాజకీయంగా బురదజల్లేందుకే కొందరు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ మండిపడ్డారు.