Indrakeeladri : వసంత నవరాత్రోత్సవాలు.. ఒక్కోరోజు ఒక్కోరకం పుష్పాలతో అర్చన
ఏప్రిల్ 02వ తేదీ నుంచి ఇంద్రకీలాద్రిపై ఉత్సవ శోభతో అలరారనుంది. రెండో తేదీన ఉగాది పండుగ, పదో తేదీ వరకు వసంత నవరాత్రి ఉత్సవాలు, 12 నుంచి 20వ తేదీ వరకు చైత్ర మాస బ్రహ్మోత్సవాలు...

Indrakeeladri
Vasanta Navaratri Utsavalu 2022 : ఏపీలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో విజయవాడలోని ఇంద్రకీలాద్రి ఒకటి. అమ్మవారిని దర్శించుకోవడానికి తెలుగు రాష్ట్రాలే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివస్తుంటారు. దసరా రోజున భక్తులతో సందడిగా మారుతుంటుంది. కానీ.. కరోనా కాలంగా.. కొన్ని ఆంక్షలు, నిబంధనలు విధించిన సంగతి తెలిసిందే. భక్తులు లేకుండానే కార్యక్రమాలు జరిగాయి. ప్రస్తుతం పరిస్థితిలో మార్పు వస్తోంది. కరోనా వైరస్ తగ్గుముఖం పడుతోంది. పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుతున్నాయి. దీంతో ప్రభుత్వం నిబంధనలు, ఆంక్షలను సడలించింది. దేవాలయాల్లో భక్తులను అనుమతినిస్తున్నారు.
Read More : RRR : ఫ్యాన్స్ ఆగ్రహం.. విజయవాడలో థియేటర్ ధ్వంసం..
దీంతో భక్తుల సమక్షంలో పూజలు, ఇతరత్రా కార్యక్రమాలు జరుగుతున్నాయి. తాజాగా.. ఏప్రిల్ 02వ తేదీ నుంచి ఇంద్రకీలాద్రిపై ఉత్సవ శోభతో అలరారనుంది. రెండో తేదీన ఉగాది పండుగ, పదో తేదీ వరకు వసంత నవరాత్రి ఉత్సవాలు, 12 నుంచి 20వ తేదీ వరకు చైత్ర మాస బ్రహ్మోత్సవాలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వసంత నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా.. శ్రీ గంగా సమేత దుర్గా మల్లేశ్వరస్వామి వార్లకు ప్రతిరోజు రకరకాల పూలతో ప్రత్యేకంగా అర్చనలు నిర్వహించనున్నారు. ఉగాది పండుగ సందర్భంగా.. ఏప్రిల్ రెండో తేదీన తెల్లవారుజామున మూడు గంటల నుంచి అమ్మవారికి స్నపనాభిషేకం, అలంకారం, అర్చన, నివేదన, హారతి తదితర కార్యక్రమలను అర్చకులు నిర్వహించనున్నారు.
Read More : TTD : తిరుమలలో ఏప్రిల్ 1 నుంచి వికలాంగుల, వృద్ధుల దర్శనాలు పున:ప్రారంభం
ఉదయం 8 గంటల తర్వాత భక్తులను దర్శనానికి అనుమతినిస్తారు. 9 గంటలకు కలశ స్థాపన, పుష్పార్చన చేస్తారు. 10 గంటలకు మల్లిఖార్జున మహామండపం ఏడో అంతస్తుపై మహారాజగోపురం ఎదురుగా కళావేదిక వద్ద పంచాంగ శ్రవణం ఉండనుంది. సాయంత్రం 4 గంటలకు యాగశాలలో అగ్నిప్రతిష్టాపన, మండప పూజ, రుద్ర హోమం, నిర్వహిస్తారు. సాయంత్రం 6 గంటలకు మహామండపం వద్ద గంగా సమేత దుర్గామల్లేశ్వర స్వామి వార్ల ఉత్సవమూర్తులను వెండి రథంపై ఊరేగించనున్నారు. వెండి రథానికి అవసరమైన మరమ్మత్తులు, పాలిష్ చేయిస్తున్నారు. ఇక చైత్రమాస వసంత నవరోత్రోత్సవాలు తొమ్మిది రోజుల పాటు పలు రకాల ప్రత్యేక పుష్పర్చనలు జరుగనున్నాయి.
Read More : KCR : యాదాద్రి పునఃప్రారంభంలో కేసీఆర్
ఏ రోజు..ఏ పుష్పంతో
తొలిరోజు వసంత నవరోత్రోత్సవాల సందర్భంగా 2 వ తేదీన మల్లెపూలు, ఏప్రిల్ 3 న కనకాంబరాలు, ఏప్రిల్ 4 న తెల్లచామంతి, ఏప్రిల్ 5 న మరువం మరియు సంపంగి పూలు, ఏప్రిల్ 6న కాగడా మల్లెలు మరియు తామర పుష్పాలు, ఏప్రిల్ 7న పసుపు పచ్చ చామంతెలు మరియు సన్నజాజులు, ఏప్రిల్ 8వ తేదీన ఎర్ర మందారం మరియు ఎర్ర గన్నేరు, ఏప్రిల్ 9వ తేదీన అన్ని రకాల పుష్పాలతో అమ్మవారికి ప్రత్యేక పుష్పార్చనలు చేయనున్నారు. ఏప్రిల్ 11వ తేదీన ఉదయం 9 గంటలకు పూర్ణాహుతితో వసంత నవరోత్రోత్సవాలు ముగియనున్నాయి.