TTD : తిరుమలలో ఏప్రిల్ 1 నుంచి వికలాంగుల, వృద్ధుల దర్శనాలు పున:ప్రారంభం

తిరుమలలో ఏప్రిల్ 1 నుంచి వికలాంగుల, వృద్ధుల దర్శనాలు పున:ప్రారంభిస్తున్నామని టీటీడీ వెల్లడించింది.

TTD :  తిరుమలలో ఏప్రిల్ 1 నుంచి వికలాంగుల, వృద్ధుల దర్శనాలు పున:ప్రారంభం

That Will Arrange Special Darshan To Handicapped And Old People

that will arrange special darshan to handicapped, old people : రెండేళ్ల తరువాత టీటీడీ మరో శుభవార్త తెలిపింది. వయోవృద్ధులు, వికలాంగులకు ప్రత్యేక దర్శనాలను పునరుద్ధరిస్తున్నట్లు ప్రకటించింది. కరోనా మహమ్మారి ఆంక్షల విధించిన క్రమంలో భక్తులకు దూరమైన సేవలను, దర్శనాలను క్రమంగా పునరుద్ధరిస్తూ వస్తోంది టీటీడీ.ఈక్రమంలో పలు నిషేధాలను సడలిస్తు భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కలిగిస్తోంది. ఈక్రమంలో రెండేళ్లుగా వికలాంగులు, వయో వృద్ధులకు నిలిచిపోయిన ప్రత్యేక దర్శనాలను.. మళ్లీ పునరుద్ధరించాలని టీటీడీ నిర్ణయించింది.

దీంట్లో భాగంగానే టీటీడీ వికలాంగులు, వయోవృద్ధులకు ప్రత్యేక దర్శనాలను పున:ప్రారంభింస్తున్నామని టీటీడీ వెల్లడించింది. ఏప్పిల్ 1 నుంచి రోజుకు 1,000 మంది చొప్పున భక్తులకు ప్రత్యేక దర్శనం కల్పించనున్నట్లు ప్రకటించింది. శుక్రవారం మినహా మిగతా రోజుల్లో ఉదయం 10 గంటలకు.. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు వయో వృద్ధులు, వికలాంగులకు దర్శనం కల్పించాలని నిర్ణయించింది.

మరోవైపు శ్రీవారి ఆలయంలో మార్చి 29న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనంతో పాటు వారాంతపు రద్దీ దృష్ట్యా భక్తులకు సర్వ దర్శనానికి దాదాపు రెండు రోజుల సమయం పడుతోంది. సాధారణ భక్తులకు మరింత ఎక్కువ సమయం కల్పించటానికి మార్చి 29న వీఐపీ బ్రేక్ దర్శనాన్ని కూడా టీటీడీ రద్దు చేసింది. దీని కోసం సోమవారం (మార్చి 28,2022) ఎటువంటి సిఫార్సు లేఖలను స్వీకరించబోమని ఇప్పటికే స్పష్టం చేసింది. దీంతో తిరుమలలో దర్శనం కోసం ఎక్కువ సమయం వేచి ఉండాల్సిన పరిస్థితులు ఉండడంతో సర్వదర్శనం భక్తులు తదనుగుణంగా తమ తిరుమల యాత్రకు ప్రణాళిక రూపొందించుకోవాలని టీటీడీ కోరింది.