Coronavirus In Inida..ఒక్క రోజులో 70 వేల మంది డిశ్చార్జ్, రికార్డు

  • Publish Date - September 6, 2020 / 10:38 AM IST

Recovery Rate Coronavirus In Inida : భారతదేశంలో కరోనా తగ్గుముఖం పట్టడం లేదు. కేసుల సంఖ్య పెరుగుతున్నా..డిశ్చార్జ్ ల సంఖ్య పెరుగుతుండడం శుభపరిణామంగా చెప్పవచ్చు. 2020, సెప్టెంబర్ 05వ తేదీ శనివారం ఒక్క రోజే 70 వేల 072 మంది డిశ్చార్జ్ అయ్యారు. రికవరీ రేటు 77.23 శాతంగా ఉంది.




ఈ విషయాన్ని కేంద్ర మంత్రిత్వ శాఖ వెల్లడించింది. సెప్టెంబర్ 03వ తేదీన 68 వేల 584, సెప్టెంబర్ 01వ తేదీన 65 వేల 081, ఆగస్టు 24వ తేదీన 57 వేల 469 మంది డిశ్చార్జ్ అయ్యారని తెలిపింది. రికవరీ సంఖ్య 31 లక్షలను దాటిందని పేర్కొంది.




ఐదు రాష్ట్రాల్లో రికవరీ 60 శాతంగా ఉందని, మహారాష్ట్రలో 21 శాతంగా ఉందని తెలిపింది. తమిళనాడు 12.63 శాతం, ఏపీ 11.91 శాతం, కర్నాటక 8.82, ఉత్తర్ ప్రదేశ్ 6.14 శాతంగా ఉందని పేర్కొంది. 8 లక్షల 46 వేల 395 యాక్టివ్ కేసులుంటే..22.6 లక్షల మంది రికవరీ అయ్యారని మంత్రిత్వ శాఖ తెలిపింది.

దేశంలో అత్యధికంగా 86 వేల 432 కొత్త కేసులు నమోదయ్యయి. దేశంలో నమోదయిన మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 41,13,812గా ఉంది. ఇందులో 8,62,320 కేసులు యాక్టివ్‌గా ఉండగా, కోలుకున్న వారిసంఖ్య 31,80,866 గా ఉంది. శనివారం దేశవ్యాప్తంగా 1065 మంది కరోనాతో మ‌రణించారు.




దేశంలో మొత్తం మ‌ర‌ణాల సంఖ్య 70,626కు చేరినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. శనివారం దేశవ్యాప్తంగా 10,92,654 మందికి కరోనా టెస్టులు చేసినట్లు ICMR ప్రకటించింది. దాంతో ఇప్పటివరకు దేశంలో 4,88,31,145 టెస్టులు చేసినట్లు తెలిపింది.

ట్రెండింగ్ వార్తలు