India Coronavirus Cases : రోజువారీ కరోనా కేసుల్లో లక్ష మార్క్ దాటేసిన భారత్.. ఇదే ఫస్ట్ టైం

దేశంలో కరోనావైరస్ కేసుల తీవ్రత పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ కూడా కరోనా కేసులకు సంబంధించి ఉన్నతస్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.

India Coronavirus Cases

India Coronavirus Cases : దేశంలో కరోనావైరస్ కేసుల తీవ్రత పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ కూడా కరోనా కేసులకు సంబంధించి ఉన్నతస్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. దేశంలోనే ఫస్ట్ టైం కరోనా కొత్త కేసుల సంఖ్య (1,03,558) లక్ష మార్క్ దాటేసింది. దాంతో మొత్తంగా 1, 25,89,067కు కేసుల సంఖ్య చేరింది. కరోనా తీవ్రత ఎక్కువగా మూడు రాష్ట్రాలకు కేంద్ర బృందాలను పంపినట్టు మోదీ తెలిపారు.

సమీక్షా సమావేశం అనంతరం మోదీ.. ఫైవ్ ఫోల్డ్ స్ట్రాటజీలో భాగంగా టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీట్ మెంట్, వ్యాక్సినేషన్, కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ వ్యూహాన్ని అమలు చేయనున్నారు. ఆరు అడుగుల దూరంతో పాటు తప్పనిసరిగా అందరూ మాస్క్ ధరించాల్సి ఉంటుంది. సెకండ్ వేవ్ వ్యాపిస్తున్న తరుణంలో మహారాష్ట్రలో అత్యధిక స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. రోజువారీ కేసుల్లో ఎప్పుడూ లేనంతంగా ఒక ఆదివారమే 57,074 కేసులు నమోదయ్యాయి.

ఇక ముంబైలో రోజువారీ కరోనా కేసుల సంఖ్య 11,163 కొత్త వి నమోదయ్యాయి. దాంతో నగరంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,52,445 కేసులకు చేరింది. ఉద్దవ్ థాకరే ప్రభుత్వం ఆదివారమే కొత్త నిబంధనలు అమల్లోకి తీసుకొచ్చింది. రాత్రి పూట కర్ఫ్యూ, వికెండ్‌లలో శుక్రవారం రాత్రి 8 గంటలకు సోమవారం 7 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయి. మహారాష్ట్ర, పంజాబ్, చత్తీస్ గఢ్ రాష్ట్రాలకు కేంద్రం ప్రత్యేక బృందాలను పంపింది. ఢిల్లీ 4000 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దాంతో మొత్తం 6.76,414 కొత్త కేసుల సంఖ్య చేరింది. గత 24 గంటల్లో చత్తీస్ గఢ్ (5,250), కర్నాటక (4,553), ఉత్తరప్రదేశ్ (4,136) మూడు రాష్ట్రాల్లో నమోదయ్యాయి.

Read:coronavirus vaccines : కరోనా వ్యాక్సిన్లు ఎంతకాలం రక్షణ ఇవ్వగలవంటే?