S 400
S-400 Air Defence System : పాకిస్తాన్,చైనా దేశాల నుంచి ఎయిరయ్యే గగనతల ముప్పుని సమర్థవంతంగా ఎదుర్కొంటూ దేశీయ గగనతలం శత్రుదుర్భేద్యంగా మర్చడంలో మరో ముందడుగు వేసింది. రష్యా నుంచి కొనుగోలు చేసిన అత్యాధునిక ఆయుధ వ్యవస్థ S-400 రక్షణ వ్యవస్థను పంజాబ్ సెక్టార్ లో మోహరించడం ప్రారంభించింది భారత్. సాధారణంగా భారత్ ఆయుధ మోహరింపులపై అధికారక ప్రకటనలు చేయడం చాలా అరుదు. ఎస్-400ల మోహరింపును రక్షణమంత్రిత్వ శాఖ వర్గాలు ధ్రువీకరించాయి.
ఎస్-400 వ్యవస్థలోని రాడార్లు 600 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను గుర్తించగలవు. దీనిని కేవలం 5 నిమిషాల్లో దాడికి సిద్ధం చేయవచ్చు. ఈ నేపథ్యంలో వాస్తవాధీన రేఖ, కశ్మీర్, నియంత్రణ రేఖ దీని పరిధిలోకి వచ్చేలా పంజాబ్ సెక్టార్‌లో మోహరిస్తున్నారు. ఫలితంగా ఇరువైపులా సరిహద్దులకు, దేశంలోని కీలక ప్రాంతాలకు ఈ గగనతల రక్షణ వ్యవస్థ అండగా ఉంటుంది. ఈ వ్యవస్థలోని క్షిపణి లాంఛర్లన్నీ దళాల వ్యూహాలకు అనుకూలంగా వేర్వేరు చోట్ల మోహరించే వెసులుబాటుంది.
ఎస్-400 అంటే ఏంటీ?
ఎస్-400 ట్రయంఫ్ గగనతల రక్షణ వ్యవస్థ. విభిన్నమైన రాడార్లు, క్షిపణుల సమన్వయంతో పనిచేసి ప్రత్యర్థుల ఫైటర్ జెట్స్, రాకెట్లు, మానవ రహిత విమానాలను కూల్చేసే ఒక వ్యవస్థ ఇది. నాటో దేశాల నుంచి వైమానిక దాడులను అడ్డుకొనేందుకు రష్యా దీనిని వాడుతోంది. దీనిని 2007 సంవత్సరంలో రష్యా సైన్యంలోకి ప్రవేశపెట్టింది. అదే ఏడాది జులైలో ఆకాశంలో సెకన్‌కు 2,800 మీటర్ల వేగంతో వస్తున్న రెండు లక్ష్యాలను 16 కిలోమీటర్ల ఎత్తున ఎస్-400 ఛేదించినట్లు రష్యా తెలిపింది. ప్రపంచంలో ఇప్పటి వరకు రష్యా, చైనా, టర్కీలు వీటిని వినియోగిస్తున్నాయి.
ALSO READ Cruise Ship : క్రూజ్ షిప్పులో 48 మందికి కరోనా పాజిటివ్