Cruise Ship : క్రూజ్‌ షిప్పులో 48 మందికి క‌రోనా పాజిటివ్‌

6,000 మందితో ప్రయాణిస్తున్న క్రూజ్ షిప్‌లో కరోనా కేసులు బయటపడటం కలకలం సృష్టించింది. ఓ మహిళ అనారోగ్యానికి గురికావడంతో వైద్యులు కరోనా పరీక్ష నిర్వహించారు. కరోనా నిర్దారణ అయింది.

Cruise Ship : క్రూజ్‌ షిప్పులో 48 మందికి క‌రోనా పాజిటివ్‌

Cruise Ship

Cruise Ship : భూమిమీదే కాదు సముద్రం మధ్యలో ఉన్న కరోనా మహమ్మారి వదలడం లేదు. ప్రపంచంలోనే అత్యంత పెద్ద క్రూజ్ షిప్పుగా పేరుగాంచిన ది రాయల్ కరేబియన్ సింఫనీ ఆఫ్‌సీన్ కరోనా క్లస్టర్‌గా మారిపోయింది. ఈ షిప్పులో ప్రయాణిస్తున్న ఓ మహిళ అస్వస్థతకు గురికావడంతో వైద్యులు ఆమెకు పరీక్షలు నిర్వహించారు.. దీంతో కరోనా పాజిటివ్ అని నిర్దారణ అయింది. వెంటనే ఆమెతో కాంటాక్ట్ ఉన్నవారికి పరీక్షలు నిర్వహించగా మొత్తం 48 మందికి కరోనా పాజిటివ్ నిర్దారణ అయింది.కాగా ఈ షిప్‌లో సిబ్బంది, ప్రయాణికులతో కలిసి మొత్తం ఆరువేల మంది ఉన్నట్లు సమాచారం.

చదవండి : Cruise Drugs Case : ఆర్యన్‌కు షరతులు ఇవే!

కరోనా కేసులు బయటపడటంతో షిప్పులు ఫ్లోరిడాలోని మియామీ బీచ్‌లో నిలిపివేశారు. ఈ శాంపిల్స్‌ను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపారు. వీరికి సోకింది క‌రోనా పాజిటివ్‌నా లేక ఒమిక్రాన్ వేరియంటా అన్న‌ది తెలియాల్సి ఉంది. ఇక మరికొందరికి పరీక్షలు చేయాల్సి ఉండటంతో ఫ్లోరిడా అధికారుల సాయంతో వీటిని నిర్వహిస్తున్నారు. కరోనా కేసుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లుగా అక్కడి అధికారులు చెబుతన్నారు. కరోనా సోకిన వారిలో స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం అందరు ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు.

చదవండి : Cruise Drug Case : ఆర్యన్ ఖాన్.. అనన్య పాండే ‘చాటింగ్’ లీక్.. గంజాయి తెప్పిస్తానన్న నటి