Cruise Drug Case : ఆర్యన్ ఖాన్.. అనన్య పాండే ‘చాటింగ్’ లీక్.. గంజాయి తెప్పిస్తానన్న నటి

సినీ నటి అనన్య పాండే, ఆమె తండ్రి చుంకీ పాండేతో కలిసి గురువారం నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) కార్యాలయానికి వెళ్లారు. అక్కడ ఆమెను దాదాపు రెండు గంటల పాటు విచారించారు అధికారులు

Cruise Drug Case : ఆర్యన్ ఖాన్.. అనన్య పాండే ‘చాటింగ్’ లీక్.. గంజాయి తెప్పిస్తానన్న నటి

Cruise Drug Case

Cruise Drug Case : సినీ నటి అనన్య పాండే, ఆమె తండ్రి చుంకీ పాండేతో కలిసి గురువారం నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) కార్యాలయానికి వెళ్లారు. అక్కడ ఆమెను దాదాపు రెండు గంటల పాటు ప్రశ్నించారు NCB అధికారులు. ఇక విచారణను ఈ రోజు కూడా కొనసాగిస్తున్నారు. క్రూయిజ్ డ్రగ్ కేసులో బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ అరెస్టైన తర్వాత బాలీవుడ్‌లోని కీలక వ్యక్తుల పేర్లు బయటకు వస్తున్నాయి. ఇండస్ట్రీలోని చాలామందికి డ్రగ్స్ సప్లయర్లతో సంబంధాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే అనన్య పాండేకి అధికారులు సమన్లు జారీ చేశారు.

చదవండి : Mumbai Drugs : ముంబై క్రూయిజ్ షిప్ డ్రగ్స్ కేసు…ఎన్సీబీ విచారణలో కీలక విషయాలు

తండ్రీకూతుళ్లు గురువారం సాయంత్రం 4 గంటల సమయంలో NCB కార్యాలయానికి చేరుకున్నారు. అంతకుముందు, NCB అధికారులు అనన్య ఇంటిపై రైడ్స్ చేశారు. ఆమె ఇంట్లో సోదాలు చేసి కంప్యూటర్, మొబైల్ ఫోన్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అదే సమయంలో, NCB అధికారులు ఆమె చాట్‌ను పరిశీలించారు. చాట్‌లో ఆర్యన్ గంజాయిని ఏర్పాటు చేయమని అనన్యను కోరినట్లు NCB అధికారులు గుర్తించారు. అవసరమైతే తానూ గంజాయి ఏర్పాటు చేస్తానని అనన్య బదులిచ్చినట్లుగా NCB అధికారులు గుర్తించారు.

చదవండి : Taliban Drugs : డ్రగ్స్ బానిసలకు అన్నం పెట్టడం లేదు, గుండ్లు గీయిస్తున్నారు..తాలిబన్ల అరాచకం

ఇక విచారణలో ఆర్యన్ తన స్నేహితుడని అనన్య చెప్పినట్లుగా తెలుస్తోంది. మరోవైపు అక్టోబర్ 3 నుంచి ఆర్యన్ జైలులో ఉన్నాడు.. అక్టోబర్ 30 వరకు జ్యుడిషియల్ కస్టడీలో ఉంచాలని కోర్టు ఆదేశించింది. ఇక అనన్యకు కూడా డ్రగ్స్ రాకెట్‌తో సంబంధం ఉన్నట్లు NCB అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాలతో ఆర్యన్, అనన్యలకు సంబంధాలు ఉన్నట్లు గుర్తించిన అధికారులు ఇందుకు సంబంధించి అనేక ఆధారాలు సేకరించారు.

చదవండి : Cruise Drugs Case : షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్‌కు 2 వారాల జ్యుడీషియల్ కస్టడీ

అయితే ఆర్యన్‌, అనన్య మధ్య జరిగిన వాట్సాప్ చాట్స్‌ పరిశీలించిన అధికారులు 2018-19 మధ్య కనీసం మూడుసార్లు ఆర్యన్‌కు డ్రగ్స్ అందేలా ఆమె ఏర్పాట్లు చేసినట్లు ఆరోపించారు. వీటిలో రెండుసార్లు ఆర్యన్‌కు వ్యక్తిగతంగా, ఒకసారి గెట్ టుగెదర్ పార్టీలో ఆమె డ్రగ్స్ ఏర్పాటు చేసిందట. ఇక అనన్య నుంచి వాట్సాప్ చాట్ తోపాటు, మనీ ట్రాన్స్ఫర్ వివరాలను కూడా NCB అధికారులు సేకరించారు.

క్రూయిజ్ డ్రగ్స్ కేసు అనన్యను కష్టాల్లో పడేస్తున్నట్లు కనిపిస్తుంది. ఆర్యన్ చుట్టూ ఉచ్చు బిగియడంతో అతడితో సంబందాలున్న అందరిని NCB అధికారులు విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అనన్యను విచారించి కీలక ఆధారాలు సేకరించారు.